పట్టిసీమ వద్ద బస:మంత్రి దేవినేని ఉమ వెల్లడి
విజయవాడ: పట్టిసీమ ప్రాజెక్టుపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రాజెక్టు వద్ద రాత్రి బస చేయనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు చెప్పారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో పూలేజయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడారు.
పట్టిసీమను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుపై అవగాహన లేనివారు విమర్శలు చేస్తున్నారన్నారు. మామిడి మార్కెట్‌లో దళారులను అరికట్టి టన్ను మామిడికి రూ.33 వేలు ధర వచ్చేలా చేశామని మంత్రి ఉమా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణానికి తుళ్లూరులో 33వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని దానిలో ఇప్పటివరకూ 28 వేల ఎకరాలకు ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తిచేశామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు.
సీఎం చంద్రబాబు సింగపూర్‌ను తలపించేలా ఏపీ రాజధానిని నిర్మించనున్నారన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతులు వారి పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని భూములను ఇచ్చారన్నారు.500 ఎకరాల భూమిలో ఉన్న రైతులు కోర్టుకు వెళ్లారని దానిపై ప్రభుత్వం కోర్టులో తన వాదన వినిపిస్తోందన్నారు.
ప్రతిపక్షానికి చెందిన కొందరు కావాలని రాద్ధాంతం చెయ్యడం వలన రైతులు నష్టపోతారని, వారి శ్రేయస్సు దృష్ట్యా ఎటువంటి రాద్ధాంతం చెయ్యవద్దని ఆయన సూచించారు. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు రాకపోతే ల్యాండ్ ఎక్విజిషన్‌లో తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications