జగన్ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టిన చిరంజీవి , పవన్ కళ్యాణ్ .. జగన్ స్వయంగా పిలిచినా గైర్హాజరు
Recommended Video
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డుమ్మాకొట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా వైయస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్, చిరంజీవిలను ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరుకాలేదు. జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ కనీసం పార్టీ ప్రతినిధిని సైతం పంపలేదు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న జగన్ కు శుభాకాంక్షలు అంటూ తెలిపారు.

జగన్ ప్రమాణ స్వీకారానికి చిరంజీవి , పవన్ కళ్యాణ్ లను స్వయంగా ఆహ్వానించిన జగన్
ఇకపోతే జనసేన పార్టీ మిత్రపక్షాలు అయిన సీపీఎం, సీపీఐ నేతలు మధు, కె.రామకృష్ణలు హాజరయ్యారు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మే 30వ తేదీన గురువారం మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, చిరంజీవికి ఫోన్ చేసి ఆహ్వానించారు.

వస్తామని చెప్పిన ఇద్దరు మెగా బ్రదర్స్ డుమ్మా
మెగా హీరో చిరంజీవికి ఫోన్ చేసి ఆప్యాయంగా మాట్లాడిన జగన్ మీకు ఏపీ మీద అవగాహన ఉంది. భవిష్యత్‌లో మీ సహకారం అవసరం..సతీ సమేతంగా ప్రమాణ స్వీకారానికి రండి అని జగన్ ఆహ్వానించగానే వెంటనే చిరంజీవి తప్పకుండా అని సమాధానం ఇచ్చారు. తన తో జగన్ అప్యాయంగా మాట్లాడిన తీరుకు అభినందనలు తెలిపారు. ఇక, పవన్ కళ్యాన్‌కు ఫోన్ చేసారు. మీరు ఎన్నికల్లో బాగా పోరాడారు..రాజకీయాలు వేరు. ఇది వ్యక్తిగత సంబంధంతో ఆహ్వానిస్తున్నా..ప్రమాణ స్వీకారానికి రండి అంటూ ఆహ్వనించారు. పవన్ సైతం షూర్ అంటూ సమాధానం ఇచ్చారు. కానీ జగన్ ప్రమాణ స్వీకారానికి మెగా బ్రదర్స్ ఇద్దరూ రాలేదు.

జగన్ ప్రమాణ స్వీకారం వైసీపీలో ఆనందం .. ప్రత్యర్ధి పార్టీలకు దుఃఖం
ఓటమి బాధలో ఉన్న జనసేనాని ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా వుంది. పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. కనీసం పవన్ కళ్యాణ్ అయినా గెలిస్తే బాగుండేది అన్న భావన అభిమానుల్లో ఉంది. ఏది ఏమైనా ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం వైసీపీ శ్రేణులకు కన్నుల పండుగ కాగా ప్రత్యర్ధి పార్టీలకు తీరని బాధ గా మారిందని చెప్పక తప్పదు.












Click it and Unblock the Notifications