పవన్, చిరు ఫిక్సింగ్: మహేష్ చిన్నాన, బాలయ్యపై గట్టు

హైదరాబాద్/రాజమండ్రి: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల పైన ప్రముఖ నిర్మా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆదిశేష గిరి రావు ఆదివారం మండిపడ్డారు. విభజనకు కారణమైన కాంగ్రెసు, బిజెపిలతో చిరు, పవన్ కళ్యాణ్‌లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు.

ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడారు. అవసరమైతే తన సోదరుడు, ప్రముఖ సినీ నటుడు కృష్ణ ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధి కేవలం జగన్‌తోనే సాధ్యమన్నారు. తెలుగు వారిని కాంగ్రెసు, బిజెపిలు అడ్డగోలుగా విభజించాయన్నారు. రాజకీయాల్లో చిరు ఐరన్ లేగ్ అని, పవన్ కాబోయే ఐరన్ లెగ్ అని మరో నటుడు విజయచందర్ ఎద్దేవా చేశారు.

 Pawan and Chiru match fixing with BJP and Congress

బాలయ్యపై గట్టు

హీరో నందమూరి బాలకృష్ణ మానసిక రోగి అని జగన్ పార్టీ నేత గట్టు రామచంద్ర రావు ధ్వజమెత్తారు. బాలయ్యకు టిక్కెట్ ఇవ్వడంతో బాబు సైకాలజీ బయటపడిందన్నారు. బాలకృష్ణ సోకో ప్రాబ్లమ్‌తోబాధపడుతున్నట్లు ఆయన కుటుంబం, ఆసుపత్రి వర్గాలే నిర్ధారించాయన్నారు. మానసిక రోగి అయిన బాలయ్యకు టిక్కెట్ అప్రజాస్వామికమన్నారు.

బోడుప్పల్ సభలో కెసిఆర్

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ... పవన్ కళ్యాణ్, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడుల ట్రాప్‌లో పడిపోయారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం హైదరాబాదులోని బోడుప్పల్ సభలో అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు ఖాయమైందని చెప్పారు. జూన్ 2 తర్వాత మన ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. ఉద్యమించిన వారి చేతులలోనే తెలంగాణ ఉండాలని ప్రజలను కోరారు. త్వరలోనే హైదరాబాదుకు ఐటిఐఆర్ రానుందని కె చంద్రశేఖర రావు ఈ సందర్భంగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+