Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోసానిపై పవన్ ఫ్యాన్స్, జనసేన ఫిర్యాదు.. పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు; తానూ కేసు పెడతానన్న పోసాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై జనసేన పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. పోసాని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పోసాని కృష్ణ మురళిపై పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తనపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నేతలు, పవన్ అభిమానులు కోరారు. దీంతో పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదైంది.

జనసేన వర్సెస్ వైసీపీ .. మధ్యలో పోసాని వ్యాఖ్యలతో ముదిరిన వివాదం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సినిమా టిక్కెట్ల ఆన్లైన్ విక్రయాలతో పాటు ఇతర సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు సినిమా వర్గాలలోనూ , రాజకీయ వర్గాలలో వివాదాన్ని రేకెత్తించాయి. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ రచ్చ కు కారణమైంది. మంత్రులు పవన్ కళ్యాణ్ పై మూకుమ్మడి దాడికి దిగటంతో జనసేన ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇక ఈ వివాదాన్ని పోసాని కృష్ణ మురళి తన వ్యాఖ్యలతో మరింత పెంచారు.

 పవన్ కళ్యాణ్ ను బ్రోకర్, ఆడపిల్లల జీవితం నాశనం చేశావంటూ తిట్టిన పోసాని

పవన్ కళ్యాణ్ ను బ్రోకర్, ఆడపిల్లల జీవితం నాశనం చేశావంటూ తిట్టిన పోసాని

ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో మధ్యలో దూరిన పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . మొన్నటికి మొన్న ఒక రాజకీయ నాయకుడు వికృతరూపం నేనిప్పుడు మీకు చూపిస్తున్నా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. థూ నువ్వో బ్రోకర్ గాడివి, ఎంతో మంది అమ్మాయిల జీవితం నాశనం చేశావంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ ఫాన్స్ పోసాని కృష్ణ మురళి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మళ్లీ ప్రెస్ మీట్ పెట్టిన పోసాని కృష్ణ మురళి తనను పవన్ ఫ్యాన్స్ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటూ, తిడుతున్నారంటూ మళ్ళీ ఏకంగా పవన్ పై వ్యక్తిగతంగా రెచ్చిపోయారు.

 మరోమారు పోసాని ప్రెస్ మీట్ .. అభ్యంతరకర వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఫిర్యాదు

మరోమారు పోసాని ప్రెస్ మీట్ .. అభ్యంతరకర వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఫిర్యాదు

తన భార్యపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని, మీ కుటుంబ సభ్యులంతా పవిత్రులా .. మీ సైకో ఫ్యాన్స్ తో నన్ను చంపించడానికి ప్రయత్నం చేస్తున్నావ్, నాకు ఏమైనా జరిగితే పవన్ కళ్యాణ్ కారణమంటూ పోసాని కృష్ణమురళి నిప్పులు చెరిగారు. ఇక పోసాని చేసిన వ్యాఖ్యలలో అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ పోసానిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో, పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్‌లను బహిష్కరించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పోసాని రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం.

సోషల్ మీడియాలోనూ పోసాని వ్యాఖ్యలపై ట్రోల్స్

అంతేకాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా పవన్ అభిమానులు పోసాని వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక సైకో, అలాగే అతని అభిమానులు కూడా అని పవన్ అభిమానులను పోసాని కృష్ణ మురళి దూషించాడు. ప్రెస్ మీట్ సందర్భంగా, పోసాని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై తన కోపాన్ని వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకి పాల్పడతాను అన్నట్టుగా ఆయన మాట్లాడారని పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక జనసేన పార్టీ కూడా పోసాని వ్యాఖ్యల వీడియో పోస్ట్ చేసి ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడుతానంటున్న వైఎస్సార్సీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి అంటూ ఆడబిడ్డలపై దాడి చేసేవారిని పక్కన పెట్టికుని, మహిళలకు రక్షణ కల్పిస్తానని ఏ మొహం పెట్టుకొని నాటకాలు ఆడుతున్నావ్ వైఎస్ జగన్ అంటూ జగన్ ను ప్రశ్నిస్తున్నారు.

పోసాని కృష్ణమురళి వాడిన భాష అభ్యంతరకరం : తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్

ఈ మొత్తం ఎపిసోడ్ తరువాత, పోసాని కృష్ణ మురళి ఇప్పుడు సినీ వర్గాల నుండి అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు. సినీపరిశ్రమలో కొనసాగుతున్న సమస్యకు వ్యతిరేకంగా పోసాని బాధ్యతారాహిత్యమైన ప్రెస్ మీట్‌ను తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఖండించింది. ప్రెస్‌క్లబ్ వేదికగా పోసాని కృష్ణమురళి వాడిన భాష తోటి సినీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉంది.దీనిని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు.

Recommended Video

    The Best Of Navarasa | Navarasa Review | Project Agni | Inmai | Suriya || Oneindia Telugu
    తనపై జరుగుతున్న దాడిపై ఫిర్యాదు చేస్తానన్న పోసాని

    తనపై జరుగుతున్న దాడిపై ఫిర్యాదు చేస్తానన్న పోసాని

    ఇదిలా ఉంటే తనపై జరుగుతున్న దాడిపై పోసాని కృష్ణ మురళి కూడా ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు . పవన్ కళ్యాణ్ సైకో ఫ్యాన్స్ తనను చంపెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారని పోసాని కృష్ణ మురళి ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనకు ప్రాణ హాని జరిగితే అందుకు పవన్ కళ్యాణ్ కారణం అని ఆయన ఆరోపిస్తున్నారు. అతని గురించి ప్రపంచానికి తెలియనివి చెప్తానని , తెలంగాణాలోనే కేసు పెడతానని, ఎక్కడ కేసు పెడితే చెల్లుతుందో అక్కడే కేసు పెడతానని పోసాని వెల్లడించారు . ఇక తాజా పరిణామాలతో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టు సాగుతున్న మాటల యుద్ధం కాస్తా జన సేన వర్సెస్ పోసాని కృష్ణ మురళి గా రూపు తీసుకుంది. ఇక ఈ పరిణామాలు ఎలాంటి వివాదాలకు దారి తీస్తాయో అన్న చర్చ అటు సినీ వర్గాలలోనూ, ఇటు రాజకీయ వర్గాలలోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారుతుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+