• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ పై మరోసారి పవన్ ఫైర్: మాతృభాషను మృత భాషగా మార్చకండి

|

ఏపీలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగున్నా, పూర్తిగా తెలుగు మీడియం తీసివెయ్యాలన్న ఆలోచనతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక దీనిపై నెలకొన్న రాజకీయ దుమారం మాత్రం ఆగటం లేదు. తాజాగా మరోమారు పవన్ కళ్యాణ్ తెలుగు మీడియం తీసివేత నిర్ణయం మంచిది కాదని చేసిన వ్యాఖ్యలు ముందు ముందు ఎలాంటి వ్యాఖ్యలకు కారణం అవుతాయో అన్న భావన కలుగుతుంది.

తెలుగు మీడియం బోధన తీసివేత నిర్ణయం సరైందికాదు అన్న ప్రతిపక్షాలు

తెలుగు మీడియం బోధన తీసివేత నిర్ణయం సరైందికాదు అన్న ప్రతిపక్షాలు

పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక దీనితో పాటు తెలుగు మీడియంను తీసివేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఈ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలుగు మీడియం బోధనను తీసివేయడం భాషకు తీవ్ర ద్రోహం చేసినట్లవుతుందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళాయి.

ప్రాక్టికల్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చే యత్నం చేస్తున్న ప్రతిపక్షాలు

ప్రాక్టికల్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చే యత్నం చేస్తున్న ప్రతిపక్షాలు


ఇంగ్లీష్ మీడియం బోధన విధానం ప్రవేశపెట్టాలనే ఆలోచన మంచిదే అయినప్పటికీ, అందుకు సంబంధించిన కసరత్తు జరగలేదని, ఇంతకాలం తెలుగు మీడియం విద్యా బోధన చేసిన టీచర్లు ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చెయ్యలేరు అని ప్రాక్టికల్ గా ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాయి ప్రతిపక్షాలు.అంతేకాకుండా భాషాప్రయుక్త మైన తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియంలో విద్యాబోధన విధానాన్ని తీసివేయడం మంచిది కాదని హితవు పలికాయి .

జగన్ , పవన్ ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

జగన్ , పవన్ ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భాషాభిమానులు, భాషా పండితులు అందరూ తెలుగు భాషను కాపాడటం కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై వ్యక్తిగత విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి. మీ ముగ్గురు భార్యల ఐదుగురు పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని పవన్ ను ప్రశ్నించారు.ఇక ఆ తర్వాత ఆ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది.

మాతృ భాష తెలుగును మృత భాషగా మార్చొద్దంటున్న పవన్ కళ్యాణ్

మరోమారు తాజాగా ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తెలుగు మీడియం విద్యా బోధన తీసివేత నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు భాష వద్దని ఎవరూ చెప్పడం లేదని... కానీ, తెలుగును మృత భాషగా కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. మాతృ భాషను, మన మాండలికాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని ఆయన పేర్కొన్నారు.

తెలుగును చంపెయ్యాలనే ఆలోచన భస్మాసుర హస్తం లాంటిది అన్న జనసేనాని

జగన్ రెడ్డి గారు 'మా తెలుగు తల్లికి' అంటూ పాడాల్సిన మీరు తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు మీడియాను నడుపుతూ, తెలుగును చంపేయాలన్న ఆలోచన భస్మాసుర హస్తాన్ని సూచిస్తోందంటూ సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. మాతృ భాషను మృత భాషగా మార్చకండని ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు.

ఇంగ్లీష్ వద్దనటం లేదు .. తెలుగును చంపకండి అంటూ ట్వీట్ల పర్వం

అంతేకాదు . ఈ సందర్భంగా సరస్వతి దేవి ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఆయన భాషా సరస్వతిని అవమానించకండి అని చెప్పారు. ట్విట్టర్లో ఆయన చేసిన పోస్టులతోపాటు తెలుగు భాషను మృతభాషగా మార్చవద్దని, ఇంగ్లీష్ వద్దని తాము చెప్పటం లేదని పేర్కొన్నారు. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను సైతం పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఏపీ సర్కార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విషయంలో తమ వైఖరి మార్చుకోకపోవటం , తెలుగు మీడియం తీసివేత నిర్ణయం ఉపసంహరించుకోకపోవటం వంటి అంశాలు పవన్ కు ఏ మాత్రం నచ్చటం లేదు. మరో పక్క ఈ వ్యవహారంపై లోక్ సభలో కూడా వాడీ వేడి చర్చ జరిగింది.

English summary
Janasena chief Pawan Kalyan once again criticized Jagan. As a Twitter platform, he expressed outrage over the decision to removal of Telugu medium education. Pawan demanded that no one opposing English language.. but the Telugu should be protected . it is not a dead language. He added that the responsibility of protecting the mother tongue and our dialects lies with the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X