పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!

ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ముఖ్య నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు ఈ రోజు నామినేష్ వేయనున్నారు. ఈ నెల 25న జగన్ పులివెందుల నుంచి.. ఈ నెల 23న పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి నామినేషన్లకు ముహూర్తంగా నిర్ణయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ రేపటి నుంచి వరసగా ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా షెడ్యూల్ ప్రకటించింది.

23న నామినేషన్
జనసేనాని పవన్ రేపు (20వ తేదీ) పిఠాపురం నుంచి తన ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ఇప్పటి వరకు తొలి విడత ప్రచారం చేసిన పవన్...టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి కొన్ని సభల్లో పాల్గొన్నారు. ఈ నెల 23న పిఠాపురం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రోజుకి కనీసం రెండు సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు రచించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సైతం ఆయన ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ నెల 20న పిఠాపురం, రాజానగరం బహిరంగ సభ లో పవన్ పాల్గొంటారు. 21న భీమవరం, నరసాపురంలో పవన్ ప్రచార సభలకు ముహూర్తం నిర్ణయించారు.

Pawan Kalayn Election campaign schedule announces to begin from Pithapuram

ప్రచార షెడ్యూల్
అదే విధంగా.. 22న తాడేపల్లెగూడెం, ఉంగుటూరులో పవన్ ప్రచారం చేయనున్నారు. 23న పిఠాపురంలో నామినేషన్, ఉప్పాడలో బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. 24న చంద్రబాబుతో కలిసి రాజంపేట, రైల్వే కోడూరు బహిరంగ సభలకు పవన్ హాజరు కానున్నారు. 25న టీడీపీ సభకు ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. 26న రాజోల్, రామచంద్రాపురంలో పవన్ ప్రచారం కొనసాగనుంది. 27న పెద్దాపురం, కాకినాడ రూరల్ లో జరిగే ప్రచార సభల్లో పాల్గొనాలని పవన్ నిర్ణయించారు. 28న జగ్గంపేట, పత్తిపాడు, అదే విధంగా 29న తిరుపతి. 30న పోలవరంలో పవన్ ప్రచారం చేయనున్నారు.

Pawan Kalayn Election campaign schedule announces to begin from Pithapuram

చంద్రబాబుతో కలిసి
మే నెలలో 1న ఎలమంచిలి, పెందుర్తి లో జరిగే సభల్లో పవన్ పాల్గొంటారు. 2న విశాఖపట్నం సౌత్ లో పవన్ ప్రచారం చేయనున్నారు. మే నెల 3న పాలకొండ, నెల్లిమర్ల లో పవన్ ప్రచారం ఉండనుంది. 4న తుని, పిఠాపురం లో పవన్ ప్రచార సభల్లో పాల్గొంటారు. 5న గుడివాడ , పామర్రు లో జరిగే సభల్లో పవన్ హాజరవుతారు. 6న రేపల్లె, అవనిగడ్డ లో సభలకు నిర్ణయించారు. 7న గన్నవరం, పెనమలూరులో జరిగే ప్రచారంలో పవన్ పాల్గొంటారు. 8, 9 తేదీలలో సమావేశాలు ఖరారు కావాల్సి ఉంది. 10న పిఠాపురం లో రోడ్ షో, సభ ఉండనుంది. 11న కాకినాడ అర్బన్ రోడ్ షో, మీటింగ్ తో ప్రచారం ముగియనుంది. అయితే, ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ నేతలు ఏపీలో ప్రచార తేదీలు ఖరారైతే వీటిలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని జనసేన నేతలు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+