పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్: చంద్రబాబు పాత దోస్తీ? జగన్‌కు ఊహించని షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu
  ఏపీలో ఏం జరుగుతుందో నో క్లారిటీ : జనసేన - లెఫ్ట్ పార్టీ - టీడీపీ కలయిక ?

  అమరావతి: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరికీ తెలియదు. ఏ పార్టీలు ఎప్పుడు కలుస్తాయో, ఏ పార్టీలు ఎప్పుడు విడిపోతాయో ఎవరూ చెప్పలేరు. తెలంగాణలో 2019లో పోటీ విషయమై దాదాపు చాలా స్పష్టంగా ఉంది. అనూహ్య నిర్ణయాలు లేకుంటే.. దాదాపు అన్ని పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశముంది.

  చదవండి: పవన్‌కు బాబు 'సంక్రాంతి' కానుక, చిరంజీవికి అలా: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం అంటూ

  ఏపీలో మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎవరు ఎవరితో కలుస్తారు, ఇప్పుడున్న టీడీపీ - బీజేపీ వచ్చే ఎన్నికల్లోను కొనసాగేనా... అనే అంశంపై స్పష్టత లేదు. పైస్థాయిలో సంబంధాలు బాగున్నాయని చెబుతున్నారు. కానీ మాటల్లోని స్నేహం చేతల్లో కనిపించడం లేదని అంటున్నారు.

  చదవండి: ఇచ్చి వెళ్లు: మహేష్ కత్తి రివర్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మద్దతుగా ఇలా!!

  టీడీపీ - బీజేపీ స్నేహం కొనసాగేనా

  టీడీపీ - బీజేపీ స్నేహం కొనసాగేనా

  సీఎం చంద్రబాబుకు దాదాపు ఏడాది తర్వాత ప్రధాని మోడీ అపాయింటుమెంట్ దొరికింది. పోలవరం, కాపర్ డ్యాం, ప్రత్యేక ప్యాకేజీ.. తదితర అంశాలపై కేంద్రంపై టీడీపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. మరోవైపు కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని, వాటిని టీడీపీ తమ ఖాతాలోకి వేసుకుంటోందని, కేంద్రానికి మంచి పేరు రాకుండా చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

  మళ్లీ ఒక్కటి కానున్నారా

  మళ్లీ ఒక్కటి కానున్నారా

  తాజాగా, సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. మళ్లీ టీడీపీ - లెఫ్ట్ పార్టీలు జత కట్టనున్నాయా, దీని కోసం ఎవరైనా పని చేస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. గతంలో టీడీపీ - లెఫ్ట్ పార్టీలు కలిసి పని చేశాయి. ఇప్పుడు పని చేస్తాయా అనేది చూడాలి. అయితే నవ్యాంధ్రకు కేంద్రం అండ అవసరం కాబట్టి టీడీపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరమే. మరోవైపు బీజేపీలోని కొందరు నేతలు కూడా ఏపీలో ఎదిగేందుకు ఒంటరిగా పోటీ చేయడమే ఉత్తమం అని భావిస్తున్నారు.

  పవన్ కళ్యాణ్ కారణంగా రాజకీయం మారుతోందా

  పవన్ కళ్యాణ్ కారణంగా రాజకీయం మారుతోందా

  ఈ చర్చ సాగుతుండగానే సీపీఐ నారాయణ సీఎం చంద్రబాబును పొగడటం ఆసక్తిని రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణంగా మళ్లీ టీడీపీ - లెఫ్ట్ మధ్య ఏమైనా పొత్తు పొడిచే అవకాశాలున్నాయా అనే చర్చ సాగుతోంది. అందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి.

  టీడీపీ - జనసేన - లెఫ్ట్ కొట్టిపారేయలేం

  టీడీపీ - జనసేన - లెఫ్ట్ కొట్టిపారేయలేం

  విభజన హామీల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీపై టీడీపీ ఆగ్రహంగానే ఉందని చెప్పవచ్చు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2019లో గెలుపు కోసం చంద్రబాబు బీజేపీని పక్కన పెట్టి తన దారి తాను చూసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అందుకు ప్రత్యామ్నాయమే లెఫ్ట్ - జనసేన - టీడీపీ కొట్టి పారేయలేమని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అవసరం. బీజేపీతో ఉంటే ఇబ్బంది తప్పదని టీడీపీ నేతలు కొందరు భావిస్తున్నారు.

  పవన్ ఫ్యాక్టర్ కలిపేనా

  పవన్ ఫ్యాక్టర్ కలిపేనా

  అదే సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరుగుతున్నారు. ఆయన అవసరం కూడా అవసరమే. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని వదిలేసి పవన్ - లెఫ్ట్‌తో జత కట్టడమే మంచిదని టీడీపీ నేతలు భావించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరోవైపు జనసేనతో జతకట్టాలని లెఫ్ట్ కోరుకుంటుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ మళ్లీ టీడీపీ, లెఫ్ట్‌ను దగ్గరకు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

  మోకరిల్లడంతో అపాయింటుమెంట్

  మోకరిల్లడంతో అపాయింటుమెంట్

  సీపీఐ నారాయణ గురువారం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించి, మోడీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కొత్త రాజధాని ప్లాన్ సూపర్ అన్నారు. సచివాలయం సహా అన్ని ప్రాంతాలు తిరిగానని చెప్పారు. అరవై, డెబ్బై ఏళ్ల వరకు ఇక ఇబ్బంది లేదన్నారు. రాజధానికి కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వడం లేదన్నారు. తమ వల్లే చంద్రబాబుకు మోడీ అపాయింటుమెంట్ ఇచ్చారన్నారు. తాను, రాజా ఇటీవల మోడీని కలిశామని, పోలవరం ప్రాజెక్టు జాప్యమైతే ఏపీకి నష్టమని తెగేసి చెప్పామని అన్నారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీలు మోకరిల్లారని, ఆ తర్వాతే చంద్రబాబుకు అపాయింటుమెంట్ ఇచ్చారని చెప్పారు.

  ఇదీ మోడీ కోరిక

  ఇదీ మోడీ కోరిక

  రాజధాని శంకుస్థాపనకు వచ్చి మోడీ మట్టి కొట్టిపోయారని నారాయణ మండిపడ్డారు. హోదా లేదు, అమరావతి లేదు, రాజధాని లేదని మండిపడ్డారు. చంద్రబాబుకు మోడీ మూడు నామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఏపీకి సహకరిస్తే చంద్రబాబు దానిని ఉపయోగించుకొని బలపడతారని మోడీ భావిస్తున్నారని, చంద్రబాబుబలపడితే బీజేపీకి లాభం లేదన్నారు. ఏపీలో తామే బలపడాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. ఏపీ విషయంలో మోడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.

  ఏడాది జైల్లో ఉంటే ఏమిటి, జగన్‌కు నారాయణ షాక్

  ఏడాది జైల్లో ఉంటే ఏమిటి, జగన్‌కు నారాయణ షాక్

  చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నారాయణ అన్నారు. మోడీకి చంద్రబాబు, వైసిపి అధినేత జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దానికి బదులు జైలుకు పోవడమే మంచిదన్నారు. రాజకీయాల్లో ఏడాది జైల్లో ఉంటే వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ప్రజల ఆశలు, ఆలోచనలు నెరవేరేలా చంద్రబాబు పోరాడాలన్నారు. ఇదిలా ఉండగా, రాజధానిలోని నిర్మాణాలను ప్రశంసించడం ద్వారా నారాయణ.. వైసీపీ అధినేత జగన్‌కు ఊహించని షాకిచ్చారు. లెఫ్ట్ పార్టీ బాబుపై ప్రశంసలు కురిపించడం ఊహించని షాకే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  CPI Narayana on Thursday praised Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu after Amaravati visit. He lashed out at PM Modi.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి