వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పాత రూటే కరెక్ట్- దాన్నే నమ్ముకుంటున్న పవన్, లోకేష్-ఎవరేమన్నా అదే సక్సెస్ మంత్ర

|
Google Oneindia TeluguNews

ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఓవైపు వైసీపీ గడప గడపకూ ప్రభుత్వంతో ప్రజల దగ్గరకు వెళ్తుంటే టీడీపీ నేతలు బాదుడే బాదుడు, మినీ మహానాడులతో హంగామా చేస్తున్నారు. అయితే వీటిన్నింటికి మించిన మరో సక్సెస్ మంత్రాన్ని ఫాలో కావడానికి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వైఎస్ జగన్ సక్సెస్ మంత్ర అయిన ఆ ఫార్ములానే ఇప్పుడు పవన్, లోకేష్ నమ్ముకుంటున్నట్లు సమాచారం.

 జగన్ సక్సెస్ మంత్ర

జగన్ సక్సెస్ మంత్ర


ఏపీలో తన తండ్రి వైఎస్సార్ ఆకస్మిక మరణం తర్వాత వెంటనే తనకు సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టి ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించిన వైఎస్ జగన్.. ఆ తర్వాత అధికారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. వైఎస్సార్ తో పాటు రకరకాల సెంటిమెంట్లను ప్రయోగించిన వైఎస్ జగన్ ఉపఎన్నికలతో విజయాల బాట పట్టారు. అయితే ఇందుకు ఆయన ప్రయోగించిన ఫార్ముల్లాల్లో ఓదార్పు యాత్ర అన్నింటికంటే కీలకమైనది. తన తండ్రి మరణంతో అనాధలైన కుటుంబాల దగ్గరకు వెళ్లి జగన్ ఓదార్చిన తీరు ఇప్పటికీ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు. కానీ ఓదార్పు యాత్రల్ని కూడా ఓ స్ధాయి వరకే చేపట్టిన జగన్ ఆ తర్వాత మరిన్ని ఫార్ములాలు తీసుకొచ్చి దాన్ని వెనక్కి నెట్టేశారు. కానీ ఇప్పుడు మరోసారి ఏపీలో విపక్షాలకు అదే వరంగా మారుతోంది.

పవన్ ఓదార్పు యాత్రలు

పవన్ ఓదార్పు యాత్రలు

ఏపీలో ఇప్పుడు తిరిగి ఓదార్పు యాత్రలు మొదలయ్యాయి. రాష్ట్రంలో వ్యవసాయంలో నష్టాలు చవిచూసి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఓదార్పు యాత్రలతో ఊరట కలుగుతోంది. కౌలు రైతుల భరోసా యాత్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ యాత్రలో బాధిత కుటుంబాలను కలుస్తున్నారు. వారి కష్టాలను కాసేపు వింటున్నారు. అవసరమైన వారికి ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాలకు పవన్ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

లోకేష్ ఓదార్పు యాత్రలు

లోకేష్ ఓదార్పు యాత్రలు


ఇదే కోవలో టీడీపీ యువనేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ఓదార్పు యాత్రల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పైకి అధికారికంగా యాత్ర చేపట్టకపోయినా వైసీపీ నేతలు, పోలీసుల చేతిలో దెబ్బతిన్న కుటుంబాలకు వరుసగా పరామర్శలు చేపడుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాల్లో లోకేష్ చేపట్టిన పరామర్శ యాత్రకు కూడా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా వైసీపీ నేతల చేతిలో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ నేతలు, సానుభూతిపరుల కుటుంబాలను ఇలా పరామర్శించడం ద్వారా వారికి అడంగా నిలుస్తామన్న విశ్వాసం కల్పిస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాల నుంచి లోకేష్ కు సానుకూల స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అధికార పార్టీ బాధితులను ఎక్కడికక్కడ పరామర్శించేందుకు లోకేష్ ప్లాన్ చేస్తున్నారు.

అడ్డంకుల్ని లెక్కచేయని పవన్, లోకేష్

అడ్డంకుల్ని లెక్కచేయని పవన్, లోకేష్

ఇలా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేపడుతున్న వరుస ఓదార్పు, పరామర్శ యాత్రలకు ప్రభుత్వం పోలీసుల సాయంతో, అధికారుల సాయంతో అక్కడక్కడా అడ్డంకులు కల్పిస్తోంది. ముఖ్యంగా నేతల్ని హౌస్ అరెస్టు చేయడం ద్వారా యాత్రల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను అడ్డుకునేందుకు దారిలో రోడ్లు తవ్వేశారు. టీడీపీ నేతల హౌస్ అరెస్టుతో లోకేష్ యాత్రలకు అడ్డంకులు తప్పడం లేదు. అయినా వీరిద్దరూ ఇవేవీ లేక్కచేయకుండా పరామర్శ యాత్రల్ని చేపడుతూనే ఉన్నారు.

English summary
janasena chief pawan kalyan and tdp leader nara lokesh depends on odarpu yatras in ap by following the footsteps of cm ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X