వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామ రాజుతో కలిసి పవన్ కళ్యాణ్- ఢిల్లీ వేదికగా : టార్గెట్ జగన్ - బీజేపీ నేతలతో భేటీ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత ఢిల్లీ లో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ తన కుమార్తె వివాహ రిసిప్షెన్ ఢిల్లీలో నిర్వహించారు. జనసేనాని ఆహ్వానించారు. దీంతో.. ఢిల్లీ వెళ్లిన పవన్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజుతో కలవటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రఘురామ రాజు కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ఆ పార్టీ నేతలకు మింగుడపడని వ్యక్తిగా మారారు.

ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు

ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు

సీఐడి కేసులో అరెస్ట్ చేయటం..ఆ తరువాత సుప్రీం కోర్టులో బెయిల్ రావటంతో ఆయన పూర్తిగా ఢిల్లీకే పరిమితం అయ్యారు. అయినా..నిత్యం ప్రభుత్వ నిర్ణయాలు-వాటి పర్యవసానాల గురించి తన దైన శైలిలో వివరిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో రఘురామ రాజు లోక్ సభ సభ్యత్వం పైన అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చింది. లోక్ సభ స్పీకర్ ను కలిసి ఫిర్యాదులు చేసింది. దీని పైన స్పీకర్ కార్యాలయం రఘురామ రాజుకు నోటీసులు సైతం జారీ చేసింది.

పవన్ -రఘురామ రాజు మంతనాలు..

పవన్ -రఘురామ రాజు మంతనాలు..

ఇక, ఇదే సమయంలో ఢిల్లీకి వచ్చిన జనసేన అధినేత పవన్ ను రఘురామ రాజు కలవటం ..ఇద్దరూ కలిసి ఫొటోలు దిగటం రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది. రఘురామ రాజుకు లోపాయి కారీగా బీజేపీ సహకరిస్తుందనే వాదన ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. వైసీపీలోని కొందరు నేతలు సైతం అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రఘురామ రాజు..బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కలవటం..ఇద్దరూ క్లోజ్ గా కనిపించటం వైరల్ అవుతోంది. గతంలోనే పవన్ - రఘురామ రాజు మధ్య సంబంధాలు ఉన్నాయి.

పవన్ కు మద్దతుగా రఘురామ రాజు..

పవన్ కు మద్దతుగా రఘురామ రాజు..

అయితే, పలు సందర్భాల్లో పవన్ ను రఘురామ రాజు ప్రశంసించిన సందర్భాలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే, కేంద్ర మంత్రి ఆహ్వానం మేరకు ప్రహ్లాద్ జోషీ కుమార్తె రిసిప్షెన్ లో పవన్ - రఘురామ రాజు కలిసారని తెలుస్తోంది. అయితే, పవన్ అక్కడకు రావటంతో పలువురు ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. అదే కార్యక్రమానికి వచ్చిన రఘురామ రాజు సైతం పవన్ తో ప్రత్యేకంగా ముచ్చటించినట్లుగా చెబుతున్నారు. ఆయన సైతం పవన్ తో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇద్దరి వాయిస్ ఒకటే అంటూ వైసీపీ..

ఇద్దరి వాయిస్ ఒకటే అంటూ వైసీపీ..

ఇప్పుడు వైసీపీ నేతలు ఇప్పుడు రఘురామ రాజుతో పాటుగా పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఏపీలో రోడ్ల దుస్థితి పైన పవన్ కళ్యాణ్ పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది .పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇదే అంశం పైన ఢిల్లీలో రఘురామ రాజు సైతం ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. గతం ప్రభుత్వ హాయంలో రోడ్లు బాగానే ఉన్నాయంటూ...వైసీపీ నేతల వాదనను ఖండించారు. అయితే, తనకు మద్దతు పెంచుకొనే క్రమంలోనే పవన్ తోనూ రఘురామ రాజు సత్సంబంధాలు కోరుకుంటున్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇద్దరి టార్గెట్ సీఎం జగన్...ఫ్యూచర్ పైనే

ఇద్దరి టార్గెట్ సీఎం జగన్...ఫ్యూచర్ పైనే

అయితే, ఇది సడన్ గా జరిగిన కలయికా.. లేక, వీరిద్దరూ టచ్ లోనే ఉన్నారా అనే చర్చ ఇప్పుడు రాజకీయంగా మొదలైంది. ఇదే సమయంలో ఏపీలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ పౌన కోవిడ్ ఆంక్షల కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు...రఘురామ రాజు..పవన్ కళ్యాణ్ తో సహా బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీని పైన తాజాగా స్పందించిన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు.
వినాయకచవితి ఉత్సవాల విషయంలో మాత్రమే.. ప్రభుత్వానికి కొవిడ్ నిబంధనలు గుర్తొచ్చాయా.. అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రశ్నించారు

Recommended Video

Virender Sehwag Imitating Pawan Kalyan With A Mass Dialogue | Oneindia Telugu
జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పవన్..

జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పవన్..

వైసీపీ నేతల ఉత్సవాలు, పుట్టినరోజు వేడుకలు, సభలకు కొవిడ్ నిబంధనలు గుర్తురాలేదా.. అని మండిపడ్డారు. వైసీపీ కుటుంబ సభ్యుల సంస్మరణ సభలకు నిబంధనలు వర్తించవా.. అంటూ దుయ్యబట్టారు. ఏ పని తలపెట్టినా ముందుగా గణపతిని వేడుకుని ప్రారంభిస్తామని గుర్తు చేశారు. గతంలో కూడా విగ్రహాలను అపవిత్రం చేశారని ఆరోపించారు. ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశాలపై ఒకటికి రెండు సార్లు చర్చించాలన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాల్సిందేనని పవన్‌కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇక, ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా పవన్ కళ్యాన్ - రఘరామ రాజు కలవటం..మంతనాల పైన వైసీపీ రియాక్షన్ ఏంటనేది వేచి చూడాలి.

English summary
Janasena Chief Pawan Kalyan and MP Raghu Rama Raju meet in Delhi became political hot discission in AP. Both cornered CM Jagan decision on restrictions on Vinayaka chavithi celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X