నాగబాబు పైన పవన్ సీరియస్, ఆ మీటింగ్స్ కు వెళ్లద్దు - ఆ ఇద్దరికీ ఘాటు హెచ్చరిక..!!

మెగా బ్రదర్ నాగబాబు పైన పవన్ సీరియస్ అయ్యారు. పార్టీ నేతలకు కీలక హెచ్చరిక చేసారు. పదవులు వచ్చిన తరువాత పార్టీ నేతల్లో మార్పు కనిపిస్తుందని మండిపడ్డారు. పార్టీ పైనా.. తన పైనా విమర్శలు చేస్తున్నా స్పందించాల్సిన బాధ్యత లేదా అంటూ మండిపడ్డారు. అన్నీ తానే మాట్లాడితే.. ఇక మీరంతా ఎందుకు అంటూ నిలదీసారు. లడ్డూ వివాదం తో పాటుగా ప్రతిపక్షం చేస్తున్న విమర్శల పైన ఎందుకు స్పందించటం లేదని ఫైర్ అయ్యారు. ఎవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసని.. పార్టీకి నష్టం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. పార్టీ నేతల సమావేశంలో పలు కీలక అంశాల ను ప్రస్తావించారు. పదవులిచ్చింది అనుభవించడానికి కాదు.. పని చేయడానికని తేల్చిచెప్పారు. లడ్డూ వ్యవహారంపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా పార్టీ నేతలెవరూ మాట్లాడడం లేదని ఆక్షేపించారు. వైసీపీ దుష్ప్రచారాలను ఎందుకు తిప్పికొట్టడం లేదని నిలదీశారు. అన్ని అంశాల పైనా తానే మాట్లాడితే ఇక పీఏసీ సభ్యులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఎందుని ప్రశ్నించారు. వైసీపీ ట్రాప్‌లో పడొద్దని జనరల్‌ బాడీ సమావేశంలో స్పష్టం చేశారు. జనసేన.. చాలా మంది రక్తం చిందించి.. వారు తిన్న దెబ్బలపై నిలిచిన పార్టీ అని.. వారి త్యాగాలను మనం గుర్తుంచుకోవాలని సూచించారు. కొందరు నేతల పేర్లు ప్రస్తావించి మరీ క్లాస్‌ తీసుకున్నారు. పరోక్షంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతిఒక్కరూ తమ వ్యక్తిగత వ్యవహారాలపై జాగ్రత్తగా ఉండాలని, వారి వల్ల పార్టీకి నష్టం కలిగిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.

pawan-kalyan-angry-over-brother-nagababu-and-kakinada-mp-over-counter-the-allegations-from-oppositio

తాను ఎవరు ఏం చేస్తున్నారో నేనొచ్చి చూడను.. ఎవరి వ్యక్తిగత జీవితం వారిదేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దానిని పార్టీకి ఆపాదించడం కరెక్టు కాదన్నారు. నాయకులు ఏదైనా తప్పు చేస్తే పార్టీపరంగా విచారణ చేస్తామని... తప్పుందని తేలితే యాక్షన్‌ తీసుకుంటామని స్పష్టం చేసారు. ఇలాంటి విషయాల్లో పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత నేతలపైన ఉందన్నారు. జనసేన నాయకులు కూటమి ధర్మాన్ని పాటించాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో కూటమి సమావేశాల్లో పాల్గొనాలన్నారు. టీడీపీ నాయకులు సమావేశాలకు పిలిస్తే వెళ్లి, అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలని.. కానీ ఆ పార్టీ నాయకుల వ్యక్తిగత సమావేశాల్లో పాల్గొనవద్దని.. దూరంగా ఉండాలని సూచించారు. మనం కేవలం పొత్తులోనే ఉన్నామన్నది గుర్తుంచుకోవాలని సూచించారు. కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, తన అన్న, ఎమ్మెల్సీ నాగబాబుపై పవన్‌ కొంత సీరియస్‌ వ్యాఖ్యలు చేశారు. కాకినాడ ఎంపీని ఉద్దేశించి.. 'మీకు లండన్‌ టూర్లకు వెళ్లేందుకు సమయం ఉంది.. కానీ పవిత్రమైన తిరుపతి లడ్డూ అంశంపై మాట్లాడడానికి టైమ్‌ లేదా' అని నిలదీశారు.

తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్

అమ్మాయిల వస్త్రధారణపై మాట్లాడడం, సోషల్‌ మీడియాలో స్పందిస్తున్న నాగబాబు.. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 'సోషల్‌ మీడియాలో, బహిరంగం గా పార్టీ గురించి, నా గురించి అనేక ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎవరూ వీటిని సీరియ్‌స్ గా తీసుకోవడం లేదు, కౌంటర్‌ చేయడం లేదు. ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి' అని స్పష్టంచేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ జోక్యం చేసుకుని.. ఆయా పార్టీల సోషల్‌ మీడియా టీమ్‌ బలంగా ఉందని చెప్పారు. పవన్‌ స్పందిస్తూ.. సోషల్‌ మీడియా పరంగా మనం కూడా బలంగానే ఉన్నామని.. మీరు గట్టిగా మాట్లాడితే అదే ప్రచారంలోకి వస్తుందని తెలిపారు. సోషల్‌ మీడియా గెలుపోటములను నిర్ణయించదని.. మన పార్టీపై వచ్చిన నెగిటివ్‌ న్యూస్‌ను మనమే వైరల్‌ చేయడం వల్ల దానికి బలం చేకూరుతోందని.. మనం ఆ పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+