ప్లీజ్ వద్దు!: మంత్రి నారాయణ 'ఒకే'పై పవన్ కళ్యాణ్ మళ్లీ ట్వీట్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్‌లో భూసేకరణ పైన స్పందించారు. ఆదివారం నాడు ఆయన ట్వీట్ చేశారు.
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల భూముల సేకరణకు భూసేకరణ చట్టం ప్రయోగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుండడంపై చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ పలుమార్లు స్పందించారు. తాజాగా ఆదివారం కూడా స్పందించడం గమనార్హం.
I request TDP govt not to use 'Land acquisition act' on unwilling farmers of multi cropped Land in capital region.
— Pawan Kalyan (@PawanKalyan) August 16, 2015 రెండు, మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కునేందుకు భూసేకరణ చట్టం అమలు చేయవద్దని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇదే తరహా కామెంట్‌ను ఆగస్టు 13న కూడా ఆయన చేశారు. భూమి ఇచ్చేందుకు అంగీకరించని రైతుల నుంచి బలవంతంగా తీసుకోవద్దని చెప్పారు.

ఆ ప్రకటన పైన స్పందించిన మంత్రి నారాయణ... పవన్ కళ్యాణ్ సూచనను పరిగనణలోకి తీసుకుంటామని చెప్పారు. అయితే, ఈ నెల 20వ తేదీ వరకు చూస్తామని, ఆ తర్వాత భూసేకరణ చేస్తామని చెప్పారు. దీంతో, పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి స్పందించినట్లుగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications