సీఎం జగన్ సక్సెస్ ను అంగీకరించిన పవన్ కల్యాణ్ - తాజా వ్యాఖ్యలతో..!!

ఏపీలో తిరిగి అధికారంలోకి వస్తాననే సీఎం జగన్ నమ్మకం వెనుక ప్రధాన కారణం ఒకటే. ప్రతీ ఇంటికి మేలు చేసాం. ప్రతీ ఇంటికి పథకం ఇచ్చాం. ఇప్పుడు ప్రచారం చేస్తుందీ అదే. ఎన్నికల సమయంలో చేయబోయేది అదే. కరోనా వచ్చినా.. రాష్ట్రం అర్దికంగా ఇబ్బందుల్లొ ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నా సంక్షేమ పథకాల అమలు ఆగలేదు. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం పథకాలు మాత్రం అమలు చేస్తున్నారనేది వైసీపీ నేతల ప్రచారం. పథకాల నిర్వహణలో అవినీతికి ఆస్కారం లేకుండా,వివాదాలు - విమర్శలకు అవకాశం లేకుండా పథకాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.

Pawan Kalyan anounces that he would continue the current schemes if voted to power,did he agree CM Jagans success

పథకాలు కొనసాగిస్తానంటూ
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంక్షేమ పథకాల గురించి విజయనగరం జిల్లాలో స్పందించారు. పేదలకు మేలు చేసే ఏ సంక్షేమ పథకాన్ని అపేది లేదని ప్రకటించారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో తెల్ల రేషన్ కార్డు దారులే లబ్ది దారులు కావటంతో..ఈ పధకాలు పేదలకు అందిస్తున్నవేనని..ఏవీ తొలిగించే ధైర్యం ఎవరికీ లేదని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమానికి పవన్ సైతం మద్దతు ప్రకటించినట్లుగా నేతలు అభివర్ణిస్తున్నారు.

Pawan Kalyan anounces that he would continue the current schemes if voted to power,did he agree CM Jagans success

సీఎం జగన్ ఎన్నికల ఆయుధం
ఏపీలో జగన్ అమలు చేస్తున్న అనేక పధకాలు ప్రజలకు చేరువ అయ్యాయని..తప్పని పరిస్థితుల్లో విపక్షాలు కూడా చెప్పకుండానే అంగీకరిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పథకాలను కొనసాగిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. కొద్ది నెలల క్రితం వరకు ఏపీ మరో శ్రీలంకగా మారుతోందంటూ విపక్షాలు విమర్శలు చేసాయి. అయితే, తాము గతంలో టీడీపీ హయాం కంటే తక్కువే అప్పులు చేసామంటూ అసెంబ్లీలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ మూడున్నారేళ్ల కాలంలో సంక్షేమానికి ఎంత మేర ఖర్చు చేసిందీ వివరించారు.

Pawan Kalyan anounces that he would continue the current schemes if voted to power,did he agree CM Jagans success

జగన్ పథకాలకు మద్దతిచ్చినట్లేనంటూ
రాష్ట్రంలోని ప్రజల్లో దాదాపు 87 శాతం మందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ లో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాల్లోనూ పథకాలను నిలిపివేసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు - ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి మద్దతుగా నిలవాలని సూచించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏపీలోని సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని చెప్పటం ద్వారా..ఈ పథకాలకు పక్కాగా ప్రజలకు చేరువ అయ్యాయని ఇప్పటికి గుర్తించారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+