గబ్బర్ సింగ్ టవల్‌ను విసిరిన ఫ్యాన్, మెడలో వేసుకున్న పవన్ కల్యాణ్

కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ సీమాంధ్ర ఆత్మగౌరవ సభ తీవ్రమైన ఉత్కంఠ మధ్య సాగింది. అభిమానుల కేరింతలతో ఉద్వేగభరితమైన వాతావరణంలో జరిగింది. పవన్ కల్యాణ్‌ను చూడడానికి అభిమానులు తీవ్రంగా పోటీ పడ్డారు. శుక్రవారం కాకినాడలో జరిగిన పవన్ కల్యాణ్ ప్రసంగం తీరును రాష్ట్రం యావత్తూ ఆసక్తితో తిలకించింది.

పవన్‌ కల్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ అభిమాని వేదికపైకి గబ్బర్‌సింగ్‌ కాశీ టవల్‌ను విసిరాడు. దాన్ని తీసుకుని పవన్ కల్యాణ్ మెడలో వేసుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో పెద్దసంఖ్యలో అభిమానులు ఆ టవల్స్‌ను వేదికపైకి వేశారు. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఒకిం త టెన్షన్‌కు గురై అభిమానులను అదుపు చేయడానికి ప్రయత్నించారు.

పోలీసులను పవన్‌కల్యాణ్‌ వారించారు. మంచినీరు లేక దాహంతో అల్లాడుతున్న ఓ అభిమానిని గమనించిన పవన్ తన వద్దనున్న వాటర్‌ బాటిల్స్‌ తీసుకొని ఆ అభిమాని దగ్గరకు వెళ్లి ఇచ్చాడు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టించింది. సీమాంధ్ర ఆత్మ గౌరవ సభకు గోదావరి జిల్లాలనుంచి 40ఏళ్లలోపు వారే అత్యధికంగా హాజరయ్యారు.

Pawan Kalyan approaces fan and gives water

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీలను ప్రధాన లక్ష్యంగా చేసుకోవడంతోపాటు కాంగ్రెస్‌, టీడీపీ వైఖరిలపై ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించినప్పుడు సీమాంధ్ర ఎంపీలు, అధికారపక్ష ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ కల్యాణ్ డైలాగులు విసిరినప్పుడు అభిమానులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.

తనపై రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు చేసిన ఆరోపణలపై పేరుపేరునా వివరణ ఇస్తూ వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+