వర్వతం వంగి సలాం చేయదు: అమెరికాలో పవన్ కల్యాణ్ దూకుడు
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అదే దూకుడుతో ప్రసంగించారు. పర్వతం వంగి సలాం చేయదని చెప్పారు.
వాషింగ్టన్: పర్వతం వంగి ఎవరికీ సలాం చేయదని, సముద్రం ఒకరి కాళ్ల వద్దకు వెళ్లదని జనసేనే చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమెరికాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమకాలీన రాజకీయ అంశాలు, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై హార్వర్డ్ శ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
పవన్ మరోసారి ఉత్తరాది, దక్షిణాది అంశాలను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఉత్తర భారతీయుల ప్రాబల్యం అంతకంతకు పెరుగుతోందని అన్నారు. దక్షిణాది వారంటే వివక్ష కొనసాగుతునే ఉందని ఆయన విమర్శించారు. తెలుగువారు పోరాడే తత్వాన్ని తమిళుల నుంచి నేర్చుకోవాలని అన్నారు. సుప్రీం కోర్టు జల్లికట్టుపై నిషేధం విధించినా పోరాడి మరీ తమ సంప్రదాయాన్ని దక్కించుకున్నారని ఆయన కొనియాడారు. కానీ ఏపీలో మాత్రం అటువంటి ధోరణి కనిపించలేదని ఆయన అన్నారు.
గబ్బర్ సింగ్ కండువాతో అమెరికాలో పవన్ కల్యాణ్ జోష్ (ఫొటోలు)
తాను ఉద్దానం బాధితుల సమస్య వెలుగులోకి తెచ్చిన తర్వాతే ప్రభుత్వం వేగంగా స్పందించిందని ఆయన చెప్పుకున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. భారత్‌లో ఐకమత్యం దెబ్బతింటోందని, ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఎప్పుడో పోయాయని ఆయన అన్నారు.
జర్మన్ భాషను అర్థం చేసుకునేందుకు మాక్స్‌ముల్లర్ భవనం ఉందని, ఫ్రెంచ్ భాషకు ఎలైన్ ఫ్రాంచైజ్ ఉందని, కానీ భారత్‌లో మాత్రం ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితులు కనిపించడంలేదని ఆయన అన్నారు. తన అభిమాన కవి శేషేంద్ర రాసిన కవితలోని పాదాలను ఆయన ఉటంకించాచరు భారత్ మాతాకీ జై అంటూ కార్యక్రమాన్ని ముగించారు.

చట్టంపై పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు
భారతదేశంలో చట్టం బలవంతుల పట్ల బలహీనంగానేూ పేదల పట్ల బలంగానూ పనిచేస్తోందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్య అని అభిప్రాయపడ్డారు. నిర్భయ చట్టం తేవడానికి 60 ఏళ్లు పట్టిందని అన్నారు. మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలను తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

కాస్తా ఇబ్బందిగానే ఉంది...
తన విద్యాభ్యాసం వీధిబడిలో ప్రారంభమైందని, దాంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించడం తనకు కాస్తా ఇబ్బందిగానే ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. తనకు ఈ అవకాశం రావడం గర్వంగా ఉందని చెప్పారు.
నేను యోగిని కావాలని అనుకున్నా...
తాను సినీ నటుడిని కావాలని అనుకోలేదని, యోగిని కావాలని అనుకున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. సామాజిక సమస్యలపై దృష్టి పెట్టడం వల్లనే విజయవంతంగా పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు తెలిపారు. చదువును కొనసాగించలేకపోయినట్లు చెప్పారు. ఒక దశల మావోయిస్టుల్లో చేరాలని కూడా అనుకున్నట్లు ఆయన చెప్పారు.

ఏం జరుగుతోందో మా తరానికి తెలియడం లేదు...
ఏం జరుగుతుందో తమ తరానికి తెలియడం లేదని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ చెప్పారు. పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలే పడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు. గుండెపోటుతో కొంత మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ముందస్తు కసరత్తు లేకుండా నిర్ణయాలు ప్రకటించడం వల్లనే ఇటువంటి సంఘనలు చోటు చేసుకున్నాయని పవన్ కల్యాణ్ చెప్పారు.












Click it and Unblock the Notifications