2019కి పవన్ కళ్యాణ్ సిద్ధం: గ్యాప్ తగ్గింది.. ఆ డబ్బు ఇలా సంపాదిస్తున్నారు!

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పలుమార్లు ప్రకటన కూడా చేశారు. అయితే, తన వద్ద రాజకీయ పార్టీని నడిపేందుకు డబ్బులు లేవని గతంలో ఓసారి చెప్పారు.

'కాటమరాయుడు'కు కేటీఆర్ కితాబు, 2019 సీఎంలు..

2019లో జనసేన పార్టీ ఏపీ, తెలంగాణలలో పోటీ చేయనుంది. పోటీ చేయాలంటే పవన్‌కు డబ్బులు కావాలి. అ డబ్బు వరుస సినిమాల ద్వారా సంపాదిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు.

ఏడాదికో సినిమా!

ఏడాదికో సినిమా!

సర్దార్ గబ్బర్ సింగ్ వంటి ఫ్లాప్ చిత్రం తర్వాత కాటమరాయుడుతో పవన్ విజయాన్ని అందుకున్నారు. ఇంతకుముందు పవన్ ఒక్కో సినిమాకు దాదాపు ఏడాది గ్యాప్ ఉండేది. అత్తారింటికి దారేది సినిమా తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్‌కు దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ వచ్చింది.

దీనికి ఆరు నెలలే

దీనికి ఆరు నెలలే

ఆ తర్వాత వచ్చిన కాటమరాయుడు సినిమాకు మాత్రం కేవలం ఆరు నెలలే పట్టింది. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలకు పచ్చజెండా ఊపాడు. ఆయా సినిమాల ద్వారా పవన్ దాదాపు రూ.150 కోట్లు జేబులో వేసుకోబోతున్నాడని చెబుతున్నారు. త్వర త్వరగా సినిమాలు తీసి ఆ మేర సంపాదించనున్నారని అంటున్నారు.

రెమ్యునరేషన్

రెమ్యునరేషన్

2019 ఎన్నికల్లోపు పవన్ చేయబోయే సినిమాలన్నిటినీ కలుపుకొంటే అంత రెమ్యునరేషన్ పవన్ చేతిలో ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్ అయినా పవన్ మాత్రం అనధికార వాటాదారుగా రూ.25 కోట్ల దాకా ఆదాయం పొందాడని అంటున్నారు.

కాటమరాయుడు సినిమాకు కూడా అదే రేంజ్‌లో పారితోషికం అందుకున్నాడని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కే సినిమాకు రూ.20 కోట్లు వస్తున్నాయంటున్నారు.

వేగంగా సినిమాలు

వేగంగా సినిమాలు

ఆ తర్వాత తమిళ డైరెక్టర్ నీశన్ దర్శకత్వంలో ఓ సినిమా, బండ్ల గణేశ్‌తో వాటాదారుగా మరో సినిమా.. ఇలా రెండు మూడు సినిమాలు చేయబోతున్నారు. ఆయా సినిమాలకూ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల దాకా పవన్ ఖాతాలో చేరుతాయని, మొత్తంగా చూస్తే దాదాపు రూ.150 కోట్ల దాకా పవన్ చేతిలో ఉంటాయని అంటున్నారు. వీటిని ఎన్నికల ఖర్చుల కోసమే సమకూర్చుకుంటున్నట్లుగా ఉందంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan to bag Rs 150 crore till 2019 elections from Many films.
Please Wait while comments are loading...