విషమంగా జయలలిత ఆరోగ్యం: పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ రద్దు
జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు (డిసెంబర్ 5) విలేకరుల సమావేశం పెట్టాలని తొలుత నిర్ణయించారు.
చెన్నై: జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు (డిసెంబర్ 5) విలేకరుల సమావేశం పెట్టాలని తొలుత నిర్ణయించారు. అయితే, అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆయన తన ప్రెస్ మీట్ రద్దు చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బహిరంగ సభ తలపెట్టారు. ఈ సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ రోజు విలేకరుల సమావేశంలో వెల్లడిస్తారని పార్టీ వర్గాలు ఆదివారం నాడు తెలిపాయి.
అయితే జయ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రెస్ మీట్ సరికాదని భావించారు. ఈ కారణంగా ప్రెస్ మీట్ రద్దు చేసినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని జనసేన ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా, జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్యం గురించి సోమవారం మధ్యాహ్నం అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థతి చాల విషమంగా ఉందని అపోలో ఆసుపత్రి 74 రోజుల తర్వాత స్వయంగా మొదటి సారి అంగీకరించింది. అయినా మా ప్రయత్నాలు మేం చేస్తున్నామని అపోలో ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
అందులో జయలలిత ఆరోగ్యం చాల విషమంగా ఉందని స్వయంగా అపోలో ఆసుపత్రి వైద్యులు దృవీకరించారు. జయలలిత గుండెపోటుతో సహ అనేక సమస్యలతో బాధపడుతున్నారని, అయినా ఆమెకు మెరుగైన చికిత్స అందించడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications