సతీ సమేతంగా పవన్ ఎంట్రీ - అన్నింటికీ అదే సమాధానం..!!
ఏపీలో పోలింగ్ పోటెత్తుతోంది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తొలి మూడు గంటల్లో 15 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు కుటుబం, తన సతీమణితో కలిసి పవన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే, కొంత కాలంగా తన పైన వస్తున్న విమర్శలకు పవన్ పోలింగ్ నాడు తన మార్క్ సమాధానం ఇచ్చారు.
పోలింగ్ సిబ్బంది సేనాని పవన్ చేతి వేలిపై సిరా ముద్ర వేసి ఈవీఎం మిషన్ దగ్గరకు పంపించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి పవన్ కళ్యాణ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో పవన్ సీఎం పవన్ సీఎం పవన్ సీఎం అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. ఓటు వేసిన పవన్ కళ్యాణ్ కీలక సందేశం ఇచ్చారు.ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల శ్రేణులు సహకరించాలని ఆయన కోరారు.

కొద్ది రోజుల క్రితం జనసేన వీడిన పోతిన మహేష్ "మీ మూడో భార్య అన్నా లెజినోవా మీతోనే ఉంటే పిఠాపురంలోని కొత్త ఇంటి పూజా కార్యక్రమాలకు సతీసమేతంగా తీసుకురండి' అని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ తన భార్యతో కలిసి మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓటు వేసిన తరువాత మంగళగరిలోని పార్టీ కార్యాలయానికి పవన్ దంపతులు చేరుకున్నారు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తుండటంతో అక్కడి పోలింగ్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో పిఠాపురంలో జరుగుతున్న పోలింగ్ ఫలితం పైన మరింత ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications