పవన్ కళ్యాణ్ కళ్లకు చంద్రబాబు గంతలు కట్టాడు: రామకృష్ణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆయన హైదరాబాదులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికైనా పిరికితనం వదిలేసి ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కళ్లకు చంద్రబాబు గంతలు కట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ఎపి రాజధాని అమరావతి కోసం లక్షలాది ఎకరాల భూసేకరణ, బాక్సైట్ తవ్వకాలపై చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అడిగారు.

ఎన్డిఎ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ నైతిక మద్దతు ఇవ్వడాన్ని ఉపసహరించుకోవాలని ఆయన సూచించారు.
ప్రత్యేక హోదా కోసం డిసెంబర్ 7వ తేదీన పార్లమెంటు ఎదుట తమ పార్టీ ధర్నా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. తమ పార్టీ చేపట్టే ధర్నాకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు హాజరు కావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications