పవన్ కల్యాణ్ క్లియర్: బిజెపిపై దండయాత్రనే, వైఎస్‌పై కాస్తా..

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ పంథా విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. బుధవారం విశాఖపట్నంలో కార్యకర్తల సమావేశంలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.

తన ప్రసంగంలో పార్టీ పంథాపై ఒక స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశారు. బిజెపికి మాత్రమే కాకుండా కాంగ్రెసు పార్టీకి కూడా ఆయన వ్యతిరేకంగా వ్యవహరించడానికి సిద్దమైనట్లు కనిపిస్తున్నారు. ఆ రెండింటిని ఆయన ఉత్తరాది పార్టీలుగా జమ కట్టారని అనుకోవాలి.

బిజెపిపై ఇలా...

బిజెపిపై ఇలా...

బిజెపి హిందూ మతానికి మాత్రమే పరిమితమైందని చెప్పడం ద్వారా పవన్ కల్యాణ్ ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారని కచ్చితంగా చెప్పడానికి అవకాశం కలుగుతోంది. అదే సమయంలో ఆయన కాంగ్రెసు పార్టీకి కూడా వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు విభజించిన తీరు బాధ కలిగించిందని ఆయన అన్నారు.

వైఎస్‌పై మెతగ్గా, జగన్‌పై ఘాటుగా....

వైఎస్‌పై మెతగ్గా, జగన్‌పై ఘాటుగా....

తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై కాస్తా మెతక వైఖరిని వ్యక్తం చేశారు. వైఎస్ చేసిన మంచీ ఉందీ, అవినీతి కూడా ఉందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్‌తో తనకు వైరం ఎందుకు ఉంటుందని అంటూనే వైఎస్ మరణించగానే సిఎం కావాలనుకోవడం జగన్ అవివేకమని ఆయన వ్యాఖ్యానించారు.

జాతీయ పార్టీ కావాలని అనడం అంటే..

జాతీయ పార్టీ కావాలని అనడం అంటే..

బిజెపిని హిందూమతానికి పరిమితమైన పార్టీగా అభివర్ణించిన పవన్ కల్యాణ్ ప్రతి పార్టీ ఏదో కులానికి చెంది ఉందని అన్నారు. అదే సమయంలో కొత్త జాతీయ పార్టీకి కావాలని అన్నారు. కులాలకు, మతాలకు అతీతమై, భరత జాతిని ప్రతిబింబించే పార్టీ కావాలనేది ఆయన చెప్పిన మాటల్లోని సారాంశంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పార్టీ ఏదైనా ఆయన మనసులో ఉందా తెలియదు.

దక్షిణాది, ఉత్తరాది తేడా గురించి....

దక్షిణాది, ఉత్తరాది తేడా గురించి....

జాతీయ పార్టీలు ఉత్తరాది పార్టీలు మాత్రమేనని, దక్షిణాది ప్రజల మనోభావాలను అవి ప్రతిబింబించడం లేదని పవన్ కల్యాణ్ గతంలో అన్నారు. దక్షిణాది కూటమిని కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఆ ప్రతిపాదన ఉందా, లేదా అనేది తెలియడం లేదు.

చంద్రబాబుపై పవన్ నో కామెంట్....

చంద్రబాబుపై పవన్ నో కామెంట్....

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ఏ విధమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి ఆయన సిద్ధపడ్డారని అనుకోవాల్సి వస్తుందా అనేది తేలడం లేదు. జగన్‌తో వైరం లేదని చెప్పడంలోని ఆంతర్యమేమిటనేది కూడా తెలియడం లేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan is clearly opposing BJP, saying it is representing Hindu religion.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి