అందుకు అంగీకరించను, ఎన్డీఏ లేకపోతే- తేల్చేసిన పవన్..!!

డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. నియోజకవర్గాల పునర్విభజన.. హిందీ భాష వివా దం పైన పవన్ స్పందించారు. తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను స్పష్టం చేసారు. లోక్‌సభ స్థానాల పునర్విభజనతో నష్టం జరగదని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభ లో ప్రాతినిథ్యం తగ్గితే తాను అంగీకరించనని పవన్ స్పష్టం చేసారు. ఒకవేళ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం లేకపోతే ఈ వైఖరి మరోలా ఉండేదని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

పవన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కీలక అంశాల పైన స్పందించారు. భాషను బలవంతంగా రుద్దడా న్ని తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. త్రిభాష విధానంలో హిందీనే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదని, ఎవరి ఇష్టం వారిదని పేర్కొన్నారు. తనకు టీనేజ్‌లో ఉన్నప్పుడు జీవితం గురించి భయం కలిగిందని చెప్పిన పవన్.. దాని కోసం అన్వేషించగా అచ్చమిల్లై అచ్చమిల్లై అనే భారతీ యార్‌ కవిత కనిపించిందని అవి ధైర్యం ఇచ్చిన పదాలని పవన్ తెలిపారు. ప్రతి భాషకూ గౌరవం ఇవ్వాలన్న పవన్‌, భాషా సంస్కృతులను గౌరవించడం తన ఏడు మార్గదర్శకాల్లో ఒకటని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాషా విధానం గురించి చేసిన ప్రసంగంలో తప్పేముం దని పవన్ ప్రశ్నించారు.

pawan-kalyan-clears-his-stand-on-delimitation-and-hindi-controversy-details-here

బలవంతమైతే వ్యతిరేకిస్తా
ఆంధ్రప్రదేశ్‌లో 30 తమిళ, 107 ఒరియా, 57 కన్నడ, 5 సంస్కృతం, 400 ఉర్దూ, 37, 000లకు పైగా తెలుగు మాధ్యమ పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. వీటి ఉద్దేశం మాతృ భాష లో బేసిక్‌ ఫౌండేషన్‌ను సులభంగా అర్థం చేసుకోవడమేనని వివరించారు. హిందీ వల్ల తమిళానికి ముప్పు ఉందనే భావన తమిళనాడులో ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ ఏ భాషనూ బలవంతంగా రుద్దకూడదని, అలా జరిగితే తానే వ్యతిరేకిస్తానని వెల్లడించారు. తమిళం నేర్చుకోవాలని ఎవరూ తనను ఒత్తిడి చేయలేదని, తానే నేర్చుకున్నానని చెప్పారు. త్రిభాషా విధానంలో హిందీనే నేర్చు కోవాలని ఎవరూ చెప్పలేదని వివరించిన పవన్.. అందులో ఐచ్ఛికాలు ఉన్నాయని చెప్పారు. హిందీని నేర్చుకుని తెలుగుకు తాను దూరం కాలేదని ఇంకా దగ్గరయ్యానని తెలిపారు. ఎక్కడో ఉన్న బ్రిటిషువారి ఆంగ్లాన్ని నేర్చుకోవడానికి లేని భయం హిందీని నేర్చుకునేందుకు ఎందుకని పవన్ ప్రశ్నించారు. పలువురు డీఎంకే నేతలు హిందీ మాట్లాడుతున్నారని తెలిపారు.

Take a Poll

ఎన్డీఏ లేకపోతే
త్రిభాషా విధానం ఏపీ, కర్ణాటకలో సహజమని పవన్ పేర్కొన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై మొదట పార్లమెంట్​లో మాట్లాడాలని, ఆ తర్వాత పోరాడాలని అలా కాకుండా ఒకే సారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం లేకపోతే ఈ వైఖరి మరోలా ఉండేదని తెలిపారు. లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గడాన్ని తానూ అంగీకరించనని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గదని తాను దృఢంగా నమ్ముతున్నట్టు పవన్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను దాటి జనసేన విస్తరించాలని తమిళనాడుకూ భావజాలాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. తమిళనాడులో బీజేపీ ఎదగగలదా అని ప్రశ్నించగా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తన ప్రయాణం సాధించిన విజయాలకు తన సోదరుడు చిరంజీవి గర్విస్తున్నారని పవన్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+