వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్ పొలిటికల్ కాంబినేషన్: దాసరి, మోహన్ బాబు కూడానా...?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పొలిటికల్ కాంబినేషన్ ఓ రూపం తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధీటుగా ఎదుర్కోవడానికి అవసరమైన సమీకరణాలు నాయకత్వ స్థాయిలో రూపు దిద్దుకుంటున్న సంకేతాలు అందుతున్నాయి.

దాసరి నారాయణ రావు పవన్ కల్యాణ్ రాజకీయాలకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని ఆయన అంటున్నప్పటికీ జనసేన పార్టీలో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ బుధవారంనాడు దాసరి నారాయణర రావు నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరి మధ్య సయోధ్య ఎప్పుడో కుదిరిన సూచనలు కనిపిస్తున్నాయి.

తన జన్మదిన వేడుకల సందర్భంగా మాట్లాడిన దాసరి నారాయణ రావు పవన్ కల్యాణ్ రాజకీయాలపై కూడా స్పందించారు. ధైర్యం ఉన్నవాళ్లు రాజకీయాల్లో సక్సెస్ అవుతారని, పవన్ కు ఆ ధైర్యం ఉందని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఆయన సున్నితమైన మనసు ఉంటే రాజకీయాల్లోకి రావద్దని, వచ్చినా లేనిపోని బురద అంటుకోవడం తప్ప జరిగేదేం ఉండదని అన్నారు. పవన్ కళ్యాణ్ ధైర్య వంతుడు, ఆయన రాజకీయాల్లో సక్సెస్ అవుతారని అన్నారు.

 Pawan Kalyan combination in politics taking shape?

ఇటీవల కూడా పవన్ కల్యాణ్ రాజకీయాలపై దాసరి నారాయణ రావు సానుకూలంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌కు కమిట్‌మెంట్‌ ఉంటుందని, మాట మీద నిలబడతాడని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లడానికి సన్నద్ధమవుతున్నాడని, బాధ్యతలు తీసుకొనేటప్పుడు రెండు పడవల మీద ప్రయాణం సరికాదనేది తన అభిప్రాయమని తెలిపారు.

అదలావుంచితే, తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇటీవల ఒకటి రెండు సార్లు చెప్పారు. తాను ఏ పార్టీలో చేరేది మాత్రం చెప్పలేదు. అయితే, ఆయన తెలుగుదేశం చేరుతారా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీవైపు మొగ్గు చూపుతారా అనే చర్చ సాగుతూ వస్తోంది. చంద్రబాబు, జగన్ కూడా మోహన్ బాబుకు బంధువులే. ఆ విషయం కూడా మోహన్ బాబే చెప్పారు.

ప్రస్తుత వాతావరణం చూస్తుంటే, మోహన్ బాబు పవన్ కల్యాణ్‌తో జత కట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అనిపిస్తోంది. దాసరి నారాయణ రావు మోహన్ బాబుకు గురువు. మోహన్ బాబుకు దాసరి నారాయణ రావు అంటే ఎనలేని అభిమానం ఉంది. దానివల్ల దాసరి నారాయణ రావు రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌ను బలపరిస్తే మోహన్ బాబు ఇటు వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మొత్తం మీద, కొద్ది నెలల్లో పవన్ కల్యాణ్ పార్టీ రూపురేఖలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు అనిపిస్తోంది.

English summary
It seems that Power star Pawan Kalyan's Jana Sena political combination is taking a shape with Dasari Narayana Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X