వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌తో తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తుపై సందిగ్ధ‌త‌?

|
Google Oneindia TeluguNews

మంగ‌ళ‌గిరి సమీపంలోని చిన‌కాకాని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తెలుగుదేశం, జ‌న‌సేన శ్రేణుల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేశాయి. 2014, 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో రెండుసార్లు తాము త‌గ్గామ‌ని, ఇప్పుడు మాత్రం త‌గ్గేదిలేద‌ని, ఎదుటివారే త‌గ్గాల‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీన్నిబ‌ట్టి ఈసారి ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయ‌డ‌మేకాకుండా ప్ర‌భుత్వం ఏర్పాటైతే మంత్రి ప‌ద‌వులు ఆశించే అవ‌కాశం క‌న‌ప‌డుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగా తెలుగుదేశం

175 నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగా తెలుగుదేశం


మ‌హానాడు విజ‌య‌వంత‌మ‌వ‌డంతోపాటు బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబుకు వ‌స్తున్న స్పంద‌న‌ను బ‌ట్టి ఎక్క‌డా త‌గ్గ‌వ‌ద్ద‌ని తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ పార్టీ బ‌లంగా ఉంద‌ని, జ‌న‌సేన ఎంత‌వ‌ర‌కు ప‌టిష్ట‌మైన క్యాడ‌ర్‌ను క‌లిగివుందో చెప్పాల‌ని కోరుతున్నారు. కొద్దిరోజుల క్రిత‌మే ప్ర‌స్తుతం పొత్తుల‌కు సంబంధించి వ‌న్ సైడ్ ల‌వ్ అని, అటువైపు నుంచి కూడా స్పంద‌న వ‌స్తే ఇబ్బంది లేద‌ని చంద్ర‌బాబునాయుడు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈసారి అధికారంలోకి రాక‌పోతే తెలుగుదేశం పార్టీ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంది. తెలుగుదేశం పార్టీ అశ‌క్త‌త‌ను క్యాష్ చేసుకునే విధంగా జ‌న‌సేనాని వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లు విశ్లేషిస్తున్నారు.

 జ‌న‌సేన క‌లిస్తే శ్రీ‌కాకుళం నుంచి నెల్లూరు వ‌ర‌కు ఏక‌గ్రీవ‌మే?

జ‌న‌సేన క‌లిస్తే శ్రీ‌కాకుళం నుంచి నెల్లూరు వ‌ర‌కు ఏక‌గ్రీవ‌మే?

జ‌న‌సేన క‌లిసివ‌స్తే శ్రీ‌కాకుళం నుంచి నెల్లూరు వ‌ర‌కు తిరుగుండ‌ద‌ని, బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి రాయ‌ల‌సీమ‌లో పార్టీకి అపూర్వ‌మైన స్పంద‌న వ‌చ్చింద‌ని, క‌చ్చితంగా అధికారం చేజిక్కించుకోవ‌చ్చ‌ని తెలుగుదేశం నేత‌లు భావిస్తున్నారు. అయితే ఇరుపార్టీలు ప‌ట్టువిడుపుల ధోర‌ణితో వెళ్లాల‌ని ఇద్ద‌రికీ ఉభ‌య‌తార‌కంగా ఉండేలా కూర్చొని చ‌ర్చించుకోవాల‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకి ష‌ర‌తులు పెట్టేంత బ‌లం జ‌న‌సేన‌కు ఉందా? అనేది ఒక‌సారి ఆ పార్టీ ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల‌ని తెలుగు త‌మ్ముళ్లు కోరుతున్నారు.

 ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి అయితే పొత్తుకు బీజేపీ సిద్ధ‌మేనా?

ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి అయితే పొత్తుకు బీజేపీ సిద్ధ‌మేనా?

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే పొత్తుకు తాము సిద్ధ‌మేన‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ ష‌ర‌తు విధించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మూడు ఆప్ష‌న్లు ప్ర‌క‌టించారు. జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి వెళ్ల‌డం, జ‌న‌సేన‌, బీజేపీ, తెలుగుదేశం క‌లిసి వెళ్ల‌డం. మూడు పార్టీలు క‌లిసివెళితే విజ‌యం న‌ల్లేరుమీద న‌డ‌క‌లా ఉంటుంద‌ని మూడు పార్టీల నేత‌లు భావిస్తున్నారు. మ‌రి ఎంత‌వ‌ర‌కు క‌లిసి వెళ‌తార‌నేది కాల‌మే నిర్ణ‌యించ‌నుంది!!.

English summary
Telugudesam with Pankal Kalyan comments, ambiguous on Janasena alliance?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X