మీనాతో పోల్చుకోవడమేంటీ మహాశయా..!!

Pawan Kalyan: జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి- భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే విషయంపై చర్చకు దారి తీసింది. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశమౌతోంది.

రాష్ట్ర, జాతీయ అంశాలపై తన ఉద్దేశమేంటో కుండబద్దలు కొట్టేశారు పవన్ కల్యాణ్.. ఈ సభ ద్వారా. తమిళనాడు రాజకీయాలపైనా వ్యాఖ్యలు చేశారు. అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని తప్పుపట్టారు. హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందనీ తేల్చి చెప్పారు.

Pawan Kalyan Pitapuram

హిందీ సినిమాల డబ్బింగ్‌తో వ్యాపారం చేసుకోవచ్చు గానీ.. హిందీని మాట్లాడకూడదా? అంటూ సూటిగా ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. హిందీని వ్యతిరేకిస్తోన్న వాళ్లు కూడా తమ సినిమాలను ఆ భాషలోకి డబ్ చేసుకోంటోన్నారంటూ చురకలు అంటించారు.

ఈ ప్రసంగంలో పవన్ కల్యాణ్.. తనను వెటరన్ నటి మీనాతో పోల్చుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. చంటి సినిమాలో హీరోయిన్ మీనా క్యారెక్టర్‌తో కంపేర్ చేసుకున్నారాయన. అందరి కంటే చిన్నవాడిని కావడం వల్ల ఆ క్యారెక్టర్ తరహాలో తాను కూడా సున్నితంగా పెరిగానంటూ పోల్చుకున్నారు.

తనను ఇంట్లో వాళ్లు సున్నితంగా పెంచారని పవన్ కల్యాణ్ చెప్పుకొన్నారు. చంటి సినిమాలో హీరోయిన్ మీనాను ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఎలా చూసుకున్నారో, ఇంట్లో వాళ్లు తనను అలా పెంచారంటూ టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి వ్యాఖ్యలను ఉటంకించారు. సున్నితమైన వ్యక్తి కావడం, అస్తమా ఉండటం వల్ల బయటికి వెళ్తే ఏమైపోతాడోనని, ఇంట్లో నుంచి బయటికెళ్లనివ్వకుండా, ఎక్కడా కదలనివ్వకుండా పెంచారని చెప్పారు.

ఓసారి చెన్నై అన్నానగర్‌లో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి ఆడపిల్ల వెళ్లిపోతే ఎలా ఆందోళన చెందుతారో.. అలా టెన్షన్ పడ్డారని, రాత్రి 10:30 అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో అన్నయ్య షూటింగ్ కేన్సిల్ చేసుకుని వచ్చాడని, నాగబాబు వీధి బయట ఎదురు చూస్తూ గడిపారని గుర్తు చేసుకున్నారు. అలాంటి వాతావరణంలో పెరిగిన తాను సినిమాల్లోకి, రాజకీయాల్లోకి వస్తానని ఎవరూ ఊహించలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+