వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు సేఫ్: పవన్ కళ్యాణ్ యుద్ధభూమి తెలంగాణ?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీని స్థాపించిన హీరో పవన్ కళ్యాణ్ తన కార్యరంగానికి తెలంగాణనే ప్రధానంగా ఎంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో తెలుగుదేశం, బిజెపి కూటమి బలంగా ఉందని భావిస్తున్న తరుణంలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసులను దెబ్బ తీయడానికి ఆయన చరిష్మాను వాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దీంతో సీమాంద్ర కాంగ్రెసు ప్రచార సారథి అయిన తన్న అన్నయ్య చిరంజీవికి ఇబ్బంది లేకుండా ఆయన వ్యవహరించే అవకాశం ఉంది.

సీమాంధ్రలో కొన్ని చోట్ల మాత్రం పర్యటించి, తెలంగాణలో ఆయన విస్తృతంగా పర్యటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉన్న రాయలసీమలో కూడా ఆయన ఎక్కువగా పర్యటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో వైయస్ జగన్ కన్నా తెలుగుదేశం, బిజెపి కూటమి కాస్తా వెనకబడినట్లు కనిపిస్తోంది. తన ఇమేజ్‌తో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ ఆ కూటమికి మద్దతు పెరిగేలా చూస్తారని అంటున్నారు.

Pawan Kalyan to concentrate on Telangana

కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, ఆయన సంతానంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణను తన సొంత ప్రాంతంగా చెప్పుకునే ప్రయత్నం చేసారు. తన తెలంగాణ అని చెప్పుకున్నారు. తన ప్రసంగంలో ఎక్కువగా తెలంగాణ గురించి మాట్లాడారు. తెలంగాణకు చెందిన గద్దర్ గురించి సానుకూలంగా మాట్లాడారు. ఆయన కేవలం కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు, మిగతా అందరినీ స్వాగతిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

దాన్నిబట్టి తెలంగాణలో ఆయన విస్తృతంగా పర్యటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ, బిజెపి కూటమికి తోడ్పడే విధంగా ఆయన ప్రచారం ఉంటుందని అంటున్నారు. తెరాస, కాంగ్రెసు తెలంగాణలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నట్లు సర్వేలో తేలింది. తన ప్రవేశం ద్వారా బిజెపి, టిడిపి కూటమికి బలాన్ని పెంచాలని పవన్ ప్రయత్నించే అవకాశాలున్నాయి.

జనసేన పార్టీ పేరును సూచించింది, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను నడిపిస్తున్నది కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటకు చెందిన రాజు రవితేజ అని చెప్పుకున్నారు. తన వెనక ఆయన తప్ప మరొకరు లేరని చెప్పుకున్నారు. దానికితోడు, ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించారు. కల్లు తాగి తాను తెలంగాణవాడినని చాటుకున్నారు. అది ఇప్పుడు కలిసి రావచ్చునని భావిస్తున్నారు. ఆ రకంగా ఆయన తెలంగాణలో కాంగ్రెసు, తెరాసలను దెబ్బ తీయడానికి అస్త్రంగా పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

English summary

 Indicating his main concentration will be on Telangana area, Pawan Kalyan delivered his speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X