నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అద్భుతమైన సెంచరీ చేసి అందరి ప్రశంసలను అందుకున్నాడు. నితీశ్ చేసిన సెంచరీ భారత ఇన్నింగ్స్‌లో కీలకంగా మారింది. ఈ క్రమంలోనే క్రికెట్ మాజీ ఆటగాళ్లతోపాటు క్రికెట్ అభిమానులు నితీష్ కుమార్ రెడ్డిని కొనియాడారు. తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
'మీరు భారత్‌లోని ఏ ప్రదేశం నుంచి వచ్చారనేది కీలకం కాదు. కానీ, దేశం కోసం మీరు ఏం చేశారనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం మీరు మన దేశ గౌరవాన్ని మరింత పెంచారు. డియర్ నితీష్ కుమార్ రెడ్డి.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టులో సెంచరీ సాధించారు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు' అని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.

ఇంకా, 'భవిష్యత్తులో మీరు (నితీశ్ కుమార్ రెడ్డి) మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆశిస్తున్నా. దేశ గౌరవాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లండి. యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా స్ఫూర్తినివ్వాలి. ఈ సిరీస్‌లో భారత్ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కాగా, ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. నితీశ్ కుమార్ రెడ్డిని అభినందించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఏపీ క్రికెట్.. నితీశ్ కుమార్ రెడ్డికి రూ. 25 లక్షల నజరానాను ప్రకటించింది. నితీశ్ కుమార్ సెంచరీ చేయడంతో ఆరోజు రాత్రి విశాఖపట్నంలో అతని కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే.
It is not which part of ‘Bharat’ you come from , but what you did for ‘Bharat.’You made our ‘Bharat’ proud
— Pawan Kalyan (@PawanKalyan) December 29, 2024
Dear ‘ Nitish Kumar Reddy,’ for making history as the youngest cricketer from Bharat to score a Test century on Australian soil. You showcased your brilliance with a… pic.twitter.com/f5CUtQ1LBB
బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో కీలక ఇన్సింగ్స్ ఆడాడు. మెల్బోర్న్ టెస్టులో అద్భుత ఇన్సింగ్స్‌తో భారత్‌ను భారీ ఫాలోఆన్ గండం నుంచి బయటపడేశాడు. టెస్ట్ కెరీర్‌లో 171 బంతుల్లో తొలి శతకం సాధించడంతో నలువైపుల నుంచి నితీష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా, టీ20 ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చినా.. నితీష్ కుమార్ రెడ్డిపై నమ్మకం ఉంచిన భారత కోచ్ గౌతమ్ గంభీర్ అతడ్ని టెస్టులోకి తీసుకున్నారు. కోచ్ నమ్మకాన్ని నిలబెడుతూ నితీశ్ కీలక ఇన్నింగ్స్ నమోదు చేశాడు.












Click it and Unblock the Notifications