మోడీ వద్ద ప్రతాపం చూపండి, వ్యాపారం తప్పు కాదు కానీ: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం ప్రత్యేక హోదా అంశం గురించి ఏపీ టీడీపీ నేతల పైన పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.
దీనిపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ తదితరులు పవన్ కళ్యాణ్ పైన దుమ్మెత్తి పోశారు. దీని పైన పవన్ ట్విట్టర్‌లో స్పందించారు.
సీమంధ్రా MPలు పౌరుషము నా మీద కాదు,కేంద్రం దగ్గర చూపించండి.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2015 సీమాంధ్రా ఎంపీలు పౌరుషం నా మీద చూపించడం కాదని, కేంద్రం వద్ద చూపించాలని పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. నన్ను తిడితే ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఇంకో దానిలో పేర్కొన్నారు.
నన్ను తిడితే 'SPECIAL STATUS'రాదు
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2015 ఎంపీలు వ్యాపారం చేయడం తప్పు కాదని, కానీ కేవలం వ్యాపారం తప్పని కౌంటర్ ఇచ్చారు.
MPలు.. వ్యాపారము చేయడము తప్పు కాదు, కేవలం 'వ్యాపారమే' చేయడము తప్పు.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2015 పవన్ కళ్యాణ్ బుధవారం నాడు మధ్యాహ్నం వరకు నాలుగు ట్వీట్లు చేశారు. అందులో మొదటి రెండు ట్వీట్లు తన పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ న్యాయవాదులపై స్పందించారు. తర్వాత రెండు ట్వీట్లలో ఏపీ టీడీపీ నేతలకు చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications