• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్: ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకుంటారా.. లేద ప్రజలే ఆపని చేయమంటారా?

|

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని తీరు మారకుంటే ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో ఆయన ఆలిండియా దళిత హక్కుల నేతలు హమాలీలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం, పోలీసులను తుపాకీలతో బెదిరించడం, తాజాగా ఏలూరు లిక్కర్ డిపోలో మాట వినలేదని దళిత కార్మికుడిని కులం పేరుతో దూషించి దాడి చేయడం చూస్తుంటే ఆయన ప్రభుత్వం యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్. ఇదే వేదికపై చింతమనేని ప్రభాకర్ తనపై దాడి చేసిన విధానాన్ని పవన్ కళ్యాణ్‌కు వివరించాడు బాధితుడు.

  వచ్చిన వారంతా ఓట్లేయరని తెలుసు, 2019లో మార్పు తీసుకొస్తా : పవన్ కళ్యాణ్

  సామాన్యుడికి భద్రతతో కూడిన పాలన అందిస్తారని, శాంతి భద్రతల విభాగాన్ని బలోపేతం చేసి అధికారులతో సక్రమంగా పనిచేయిస్తారన్న నమ్మకంతోనే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. బెదిరింపులు, దౌర్జన్యాన్ని చూస్తుంటే చింతమనేని వ్యవహార శైలి రౌడీ షీటర్‌ను తలపిస్తోందన్నారు. ఇప్పటికే 37 కేసులు చింతమనేనిపై ఉన్నాయని తాజా ఘటనతో కేసుల సంఖ్య 38కి చేరుకుందని పవన్ గుర్తుచేశారు.

  Pawan Kalyan demands govt to take action on MLA Chinthamaneni

  మనది ప్రజాస్వామ్య దేశం అని చింతమనేని మరిచినట్లున్నారని అందుకే రాచరికంలా నడుచుకుంటున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ఓవైపు దళిత తేజం అంటూ ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటుండగా.. మరోవైపు అతని సొంత ఎమ్మెల్యేలే కులాల పేరుతో దూషించి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు తన ఎమ్మెల్యేలను క్రమశిక్షణలో పెట్టుకోకపోతే ఆ బాధ్యతను ప్రజలే తీసుకుంటారని హెచ్చరించారు. "మీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా..? లేక ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో చూస్తారా..?" అంటూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని నిలదీశారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  "Will you take action on your MLA's or shall the people do that"Janasena Chief Pawan Kalyan questioned AP Chief Minister Chandrababu naidu. Pawan Kalyan met the all india dalit rights leaders where a dalit person complained on the Dendalur MLA Chintamaneni Prabhakar for assaulting him on caste lines. Mr. Pawan kalyan demanded the government to book Chinthamaneni under SC/ST atrrocity case.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more