చేగొండి దీక్షపై స్పందించిన పవన్- ఫోన్ లో పరామర్శ-చర్చించాలని జగన్ సర్కార్ కు వినతి..
కాపులకు బీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందంటూ కేంద్రం ఇచ్చిన క్లారిటీతో ఏపీలో కాపు రిజర్వేషన్ల హీట్ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం తక్షణం ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో సీనియర్ రాజకీయ నేత చేగొండి హరిరామజోగయ్య దీక్షకు దిగారు. అయితే వయోవృద్ధుడు కావడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన్ను ఏలూరు ఆస్పత్రికి తరలించారు.
కాపు రిజర్వేషన్లు ఇచ్చి తీరాలంటూ ఏలూరు ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న చేగొండి హరిరామజోగయ్యకు పరామర్శలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ను ఫోన్ లో పరామర్శించినట్లు తెలుస్తోంది. చేగొండి హరిరామజోగయ్య గారి దీక్షపై స్పందించిన జనసేన అధినే పవన్.. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.

కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ కోసం చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని పవన్ కోరారు. 85 సంవత్సరాల వయసులో హరిరామ జోగయ్య దీక్ష చేపట్టారని పవన్ తెలిపారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నట్లు పవన్ పేర్కొన్నారు. హరిరామజోగయ్య గారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం, బాధ్యులు తక్షణం చర్చలు చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications