Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pawan Kalyan: వైసీపీకి పవన్ తాజా వార్నింగ్- క్లీన్ చిట్ ప్రచారంపై ఫైర్..!

ఏపీలో తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిని కల్తీ చేసిన వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేతలు క్షమాపణ చెప్పాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) డిమాండ్ చేశారు. ఇవాళ ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్. లడ్డూ వ్యవహారంలో సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకోవడాన్ని తప్పుబట్టారు. రసాయనాలు కలిసిందని రిపోర్ట్స్ లో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.

వైసీపీ హయాంలో అపచారాలు

గతంలో వైసీపీ హయాంలో చాలా ఘటనలు జరిగాయని, రామతీర్దం, పిఠాపురంలో జరిగిన ఘటనల్ని పిచ్చోళ్లు చేశారని చెప్పారని పవన్ గుర్తుచేశారు. విజయవాడ దుర్గగుడిలో వెండి విగ్రహాలు పోతే ఇంకోటి కొనుక్కోవచ్చని చెప్పారన్నారు.నెల్లూరు నుంచి దేవాలయాల్ని అపవిత్రం చేసిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా 219 జరిగాయన్నారు. జననసేన దీనిపై రాజకీయ లబ్ది కావాలని కోరుకోలేదన్నారు. 2024లో ఎన్డీయే సమావేశంలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ ఆధారంగా నెయ్యి కల్తీ జరిగిందని చంద్రబాబు తమకు చదివి వినిపించారని పవన్ తెలిపారు. మూడు రిపోర్ట్స్ లో ఒకదాంట్లో ఇందులో చేపనూనె ఉందని, ఇంకో దాంట్లో జంతుకొవ్వు, పందికొవ్వు, ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు కలిసిందని తేలిందన్నారు. దీనిపై పర్యవసానాలు ఆలోచించే మాట్లాడామన్నారు.

Pawan Kalyan Demands YSRCP Apology Over SIT s Ghee Adulteration Clean Chit

భగవంతుడిపై పగబట్టిన వైసీపీ

కానీ వైఎస్సార్సీపీ వాళ్లు భగవంతుడి మీదే పగబట్టారని, అదేంటో అర్దం కాదన్నారు. దీన్ని సరిదిద్దాలనే మేం ప్రయత్నించామని తెలిపారు. వీళ్లు నెయ్యిలో కొవ్వు లేదంటున్నారని, కానీ ఇందులో అసలు నెయ్యి ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. దీన్ని నెయ్యి అనకుండా పామాయిల్ అనాలన్నారు. దీంతో తయారు చేసిన లడ్డూలే అయోధ్యకూ పంపారన్నారు. ఇందులో 58 లక్షల పామాయిల్, ఇతర కెమికల్స్ దొరికాయన్నారు. ఎక్కడా సీబీఐ వీళ్లకు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. పాలకొవ్వుతో రావాల్సి నెయ్యిలో కెమికల్స్ ఉన్నాయని చెప్పారు.

Pawan Kalyan Demands YSRCP Apology Over SIT s Ghee Adulteration Clean Chit

క్లీన్ చిట్ ఎవరిచ్చారు ?

మిగతా విషయాలు చెప్పలేమన్నారు. ఈ వ్యవహారంతో ఎక్కడా మతంతో సంబంధం లేదన్నారు. దొరికిన వాళ్లంతా హిందువులే అన్నారు. తప్పుజరిగిపోయిందని క్షమాపణ అడగకుండా మమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు. భగవంతుడితే పెట్టుకున్న వారు సర్వనాశనం అయిపోతారన్నారు. మార్కెట్లో 400రూపాయలకు పైగా నెయ్యి ఉంటే అంతకంటే తక్కువకు నెయ్యి కొన్నారంటే ఇందులో కల్తీ జరిగిందని గృహిణులు కూడా చెప్తారని, వివేకా హత్య ఎవరు చేశారో రోడ్డు మీద చిన్న పిల్లాడు కూడా చెప్తాడని, అయినా గుండెపోటు అని చెప్పారన్నారు. నెయ్యి కల్తీ జరిగిందని సీబీఐ చెప్పినా క్లీన్ చిట్ అని చెప్పుకుంటున్నారని పవన్ ఆక్షేపించారు. ఏడు కొండలు అక్కర్లేదు రెండు కొండలు చాలు అన్న వాళ్లు ఏ స్థాయికి అయినా దిగజారగలరన్నారు. ఇంకా బుకాయించొద్దు. తప్పు చేసిన ప్రతీ ఒక్కరినీ బాధ్యుల్ని చేస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+