తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి - పవన్ కల్యాణ్..!!
జనసేనాని పవన్ కల్యాణ్ కీలక డిమాండ్ చేసారు. తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. వైసీపీ మంత్రులు నోరు అదుపులోకి పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు బాధకలిగిస్తే వ్యక్తిగతంగా మాట్లాడాలని..
ప్రజలకు ఆపాదిస్తూ తెలంగాణ ప్రజలను తిట్టటం..తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. వైసీపీ మంత్రులు అదుపు తప్పి మాట్లాడితే సీఎం స్పందించాలన్నారు. తెలంగాణలో బొత్సా లాంటి వారికి వ్యాపారాలు లేవా అంటూ పవన్ ప్రశ్నించారు.

తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా:: తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ - ఏపీ మంత్రుల మధ్య జరిగిన డైలాగ్ వార్ పైన పవన్ కల్యాణ్ స్పందించారు. హరీష్ రావు ఏపీకి సంబంధించిన చేసిన వ్యాఖ్యలు..ఆ సమయంలో ఏపీ మంత్రులతో జరిగిన విమర్శలు ప్రతివిమర్శల్లో హద్దులు దాటి మాట్లాడటం ఇబ్బంది కరంగా ఉందన్నారు.
గతంలోనూ తెలంగాణ నేతలు ఇదే విధంగా మాట్లాడిన సమయంలో పాలకులు - ప్రజలు వేర్వేరు అని తాను చెప్పిన అంశాన్ని గుర్తు చేసారు. పాలకులు చేసిన వ్యాఖ్యలతో ప్రజలకు సంబంధం లేదని పవన్ పేర్కొన్నారు. మంత్రి హరీష్ ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేసారో..అవి బాధ కలిగిస్తే ఏపీ నేతలు వ్యక్తిగతంగానే మాట్లాడాలని..తెలంగాణ ప్రజలను తిట్టటం.. తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించటం సరి కాదన్నారు.
ముఖ్యమంత్రి స్పందించాలి: ఏపీ మంత్రుల వ్యాఖ్యలను తనకు వ్యక్తిగతంగా మనస్థాపం కలిగించాయని చెప్పుకొచ్చారు. వ్యాఖ్యలు చేసిన వారిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడాలని..తెలంగాణ ప్రజలను కలిపి తిట్టవద్దని పవన్ సూచించారు. ఈ పరిణామాలపై వైసీపీ సీనియర్లు స్పందించాలని డిమాండ్ చేసారు. ఏపీ మంత్రులు, నేతలకు తెలంగాణలో వ్యాపారాలు లేవా అని పవన్ ప్రశ్నించారు. బొత్సా లాంటి వారికి తెలంగాణలో మొన్నటి వరకు కేబుల్ వ్యాపారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
మంత్రులు అదుపు తప్పి మాట్లాడితే సీఎం స్పందించాలన్నారు. ఇప్పటికే మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యల పైన ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి అప్పలరాజును మందలించింది. ఇప్పుడు పవన్ వ్యాఖ్యల పైన వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి pic.twitter.com/s3OGDfF1mM
— JanaSena Party (@JanaSenaParty) April 16, 2023
విద్యా, ప్రార్ధనా స్థలాలకు రూ 25 లక్షల విరాళం: ముస్లిం విద్య, ధార్మిక సంస్థలు, ప్రార్ధనా స్థలాలకు పవన్ కల్యాణ్ రూ 25 లక్షల విరాళం అందించారు,జనసేన అధికారంలోకి వస్తే ముస్లింల ఆవాస ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుందని పవన్ హామీ ఇచ్చారు. ఏ మతం, కులంలో పుట్టాలనే ఛాయిస్ మన చేతుల్లో లేదని పవన్ చెప్పుకొచ్చారు.
ఏ మతం, కులంలో పుట్టినా మానవత్వంతో జీవించడం మాత్రం మన చేతుల్లోనే ఉందన్నారు. భగవంతుడు దృష్టిలో మనందరం సమానమేనని చెప్పారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కుల, మతాలకు అతీతంగా పేదరికం పారదోలడం మీద దృష్టిపెడతామన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ముస్లింలకు ప్రత్యేక పథకాల అమలు పై పార్టీ తరపున చ్చకు పెడతామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications