వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ మమ్మల్ని తిట్లేదు: బీజేపీ నేత, బాబు పిలిస్తేనే.. బోండాకు టీజీ కౌంటర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభలో తమ పార్టీని విమర్శించలేదని బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ బుధవారం నాడు అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చుతామని చెప్పారు.

బయట హామీలు సహా అన్నింటిని అమలు చేస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాజ్యాంగపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. హోదా వలన వచ్చే అన్ని రకాల ప్రయోజనాలను నెరవేర్చేందుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

టిడిపిలో 'పవన్ కళ్యాణ్' చిచ్చు: కాళ్లు విరిచేస్తారన్న టీజీపై ఉమ ఆగ్రహం టిడిపిలో 'పవన్ కళ్యాణ్' చిచ్చు: కాళ్లు విరిచేస్తారన్న టీజీపై ఉమ ఆగ్రహం

14వ ఆర్థిక సంఘం సిఫార్సును అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయని చెప్పారు. హోదాను 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను పార్లమెంటు ఆమోదించిందని చెప్పారు. సిద్ధార్థనాథ్ మాటల ద్వారా హోదా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని మరోసారి అర్థమవుతోందని అంటున్నారు.

Pawan Kalyan did not blame us: BJP leader

బోండా ఉమకు టిజి వెంకటేష్ కౌంటర్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన రెండు రోజుల క్రితం టిడిపి ఎంపీ టీజీ వెంకటేష్ దుమ్మెత్తి పోశారు. హోదా పైన తమను టార్గెట్ చేయడాన్ని ఖండించారు. పవన్ ఇవే మాటలు తమిళనాడులో మాట్లాడితే కాళ్లు చేతులు విరగ్గొట్టేవారన్నారు. దానికి సొంత పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ.. టీజీ పైన నిప్పులు చెరిగారు.

ఇది కాంగ్రెస్ పార్టీ కాదని, తెలుగుదేశం పార్టీలో ఉన్నారనే విషయం తెలుసుకోవాలని, పవన్ కళ్యాణ్ టిడిపి పైన విమర్శలు చేయలేదని, దానిని అర్థం చేసుకోవాలని బోండా ఉమ అన్నారు.

దీనిపై బుధవారం నాడు టీజీ వెంకటే కౌంటర్ ఇచ్చారు. బోండా ఉమ వాస్త‌వాలు తెలుసుకోవాలని మాట్లాడాలన్నారు. చంద్ర‌బాబు ఆహ్వానిస్తేనే తాను తిరిగి టిడిపిలోకి వచ్చానని షాకిచ్చారు. అన్ని పార్టీల్లోనూ గతంలో కాంగ్రెస్‌లో ప‌ని చేసిన నేత‌లు ఉన్నార‌న్నారు. ఎన్టీఆర్ ఆహ్వానిస్తే పార్టీకి రూ.ల‌క్ష తొలిఫండ్ ఇచ్చింది తానేనని చెప్పారు. కొంద‌రు ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ల వ‌ల్ల పార్టీ వీడాల్సి వ‌చ్చిందన్నారు. ఆత్మగౌరవం అంటే ఏమిటో తమకు తెలుసునని చెప్పారు. అందుకు ఏపీ ఎంపీలు ఎవరూ తక్కువ లేరన్నారు.

English summary
The BJP leader on Wednesday said that Jana Sena chief Pawan Kalyan did not blame us over Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X