ఇట్స్ క్లియర్.. పవన్ అక్కడికి వెళ్లట్లేదు, వ్యతిరేకత పెరుగుతుందనే?: జనసేన
హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఏ పార్టీ తరుపున ప్రచారం చేయబోరని జనసేన స్పష్టం చేసింది. అసలు పవన్ కర్ణాటకలో పర్యటించబోరని తెలిపింది. దీంతో పవన్ జేడీఎస్ తరుపున ప్రచారం చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది.
ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తే మిగతా వాటి నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణంతోనే జనసేన అధినేత ప్రచారానికి దూరంగా ఉండబోతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ కారణంతోనే గతంలో జేడీఎస్ నేత కుమారస్వామి స్వయంగా పవన్ కల్యాణ్ ను కలిసినా.. జనసేనాని మాత్రం ఎలాంటి హామి ఇవ్వలేదు.

ఇకపోతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేశారు. పవన్ మాత్రం కర్ణాటక ఎన్నికల జోలికి వెళ్లకపోవడమే బెటర్ అని భావిస్తున్నారట.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేసినందునే పవన్ కర్ణాటక ఎన్నికలకు దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో 175సీట్లలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా అన్ని కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications