జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ - కాసేపట్లో కూటమి బాస్ గా చంద్రబాబు..!

ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా కూటమిలో పార్టీల శాసనసభాపక్ష నేతల ఎన్నికలతో పాటు ఎన్డీయే నేత ఎన్నిక కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి. ముందుగా జనసేన పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. కాసేపట్లో టీడీపీఎల్పీ, బీజేఎల్పీ నేతల ఎన్నికలు, ఆ తర్వాత ఎన్డీయే నేత ఎన్నిక ఉండబోతున్నాయి.

ఇవాళ ఉదయం జనసేన పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీలో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పేరును జనసేన శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదించారు. దీన్ని ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా బలపరచడంతో పవన్ కళ్యాణ్ జనసేన శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

pawan kalyan elected as janasena legislative party leader Chandrababu to elect as nda leader today

అనంతరం టీడీపీ, బీజేపీ కూడా తమ శాసనసభా పక్ష నేతల ఏర్పాటుకు భేటీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. టీడీపీ శాసనసబాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక కావడం లాంఛనమే. బీజేపీ నుంచి ఈసారి శాసనసభాపక్ష నేతగా ఎవరుంటారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీనియర్ నేతలైన సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్ లో ఒకరికి బీజేపీ శాసనసభాపక్ష నేతగా అవకాశం దక్కనుంది.

pawan kalyan elected as janasena legislative party leader Chandrababu to elect as nda leader today

అనంతరం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీయే కూటమి పార్టీల ఎమ్మెల్యేలంతా హాజరు కాబోతున్నారు. ఈ భేటీలో ఎన్డీయే కూటమి నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలంతా ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఎన్డీయే కూటమి తరఫున చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు గవర్నర్ ను కలిసి మద్దతు లేఖల్ని అందిస్తారు. దీంతో రేపటి ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి మార్గం సుగమం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+