ఏపీలో ఎదురీదుతున్న పవన్ కళ్యాణ్; తెలంగాణాలో జనసేన పోటీ అవసరమా సామి?

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని అందుకోసం కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికలలో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు ఒకే ఒక్క స్థానానికి పరిమితమై, ఇక ఆ స్థానం కూడా తమ చేతిలో లేకుండా మిగిలిపోయిన జనసేన పార్టీ తెలంగాణ పై ఫోకస్ చేస్తే తెలంగాణ రాజకీయాలలో ప్రభావం ఉంటుందా? అన్న చర్చ జరుగుతుంది .

క్షేత్రస్థాయిలో తెలంగాణాలో జనసేనకు బలమైన నాయకులు లేని క్రమంలో జనసేన తెలంగాణలో పోటీ చేస్తే నవ్వులపాలయ్యే పరిస్థితి వస్తుందా? అన్నది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణాలో జనసేన పోటీపై ఆసక్తికర చర్చ1

తెలంగాణాలో జనసేన పోటీపై ఆసక్తికర చర్చ1

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఒకపక్క తెలంగాణలో సీఎం కేసీఆర్ పై బిజెపి, కాంగ్రెస్ ల తో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒత్తిడి పెంచుతున్న వేళ తాజాగా జనసేన పార్టీ కూడా వచ్చే సాధారణ ఎన్నికల కోసం కసరత్తులు ముమ్మరం చేయడం ఆసక్తికర రాజకీయాలకు కారణంగా మారింది. అయితే జనసేన పార్టీ తెలంగాణలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తుందన్న నమ్మకం ఏ ఒక్కరికీ లేదు.

ఏపీలోనే ఎదురీదుతున్న జనసేన .. తెలంగాణాలో పోటీ చేస్తే మరింత ఒత్తిడి?

ఏపీలోనే ఎదురీదుతున్న జనసేన .. తెలంగాణాలో పోటీ చేస్తే మరింత ఒత్తిడి?

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై గట్టిగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, గత ఎన్నికల్లో జనసేన చావు దెబ్బ తింది.వచ్చే ఎన్నికల్లోనూ జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన, బలమైన పోరాటం చేయవలసిందే.

ఇప్పుడు కూడా ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నది అంత చిక్కకుండా ఉంది. ఇక ఈ సమయంలో తెలంగాణ పైన కూడా జనసేన ఫోకస్ చేయడం పవన్ కళ్యాణ్ పై మరింత ఒత్తిడి పెంచడమే కాకుండా, జనసేన పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అన్న భావన వ్యక్తమవుతోంది.

పవన్ పార్టీ తెలంగాణాలో పోటీ మంచి పరిణామమేనా?

పవన్ పార్టీ తెలంగాణాలో పోటీ మంచి పరిణామమేనా?

ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీపై పెద్దఎత్తున పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం పై ఫోకస్ పెట్టడం అంత మంచి పరిణామం కాదు అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుండి వ్యక్తమౌతుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ పోటీకి సై అంటున్న పవన్ కళ్యాణ్, ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తులు చేస్తున్నారు.

ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కార్యవర్గ ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

అభ్యర్థులను ప్రకటించి ప్రజా క్షేత్రంలోకి వెళ్ళినా ఫలితం ఉంటుందా?

అభ్యర్థులను ప్రకటించి ప్రజా క్షేత్రంలోకి వెళ్ళినా ఫలితం ఉంటుందా?

పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి 32 నియోజకవర్గాలలో కార్యనిర్వాహకులను ఎంపిక చేసి కార్యాచరణ మొదలుపెట్టినట్టు జనసేన పార్టీ తెలంగాణ ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక వీరంతా పార్టీ అభ్యర్థులుగా ఎవరు ఎన్నికల బరిలోకి దిగితే విజయం సాధిస్తారు అన్నదానిపై అధ్యయనం చేసి నివేదికలు తయారుచేసి అధినేతకు అందిస్తే, తదనుగుణంగా అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన పార్టీ చెబుతుంది. కానీ అభ్యర్థులను ప్రకటించి ప్రజా క్షేత్రంలోకి వెళ్ళినా పెద్దగా జనసేన ప్రభావం ఉండబోదు అన్నది చర్చ జరుగుతుంది.

తెలంగాణాలో కనిపించని జనసేన ఉనికి.. అభాసు పాలవుతారా?

తెలంగాణాలో కనిపించని జనసేన ఉనికి.. అభాసు పాలవుతారా?

అయితే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పర్యటించిన సమయంలో తప్ప, ఇతర సమయాలలో ఎటువంటి ఆందోళనలు కానీ, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసిన దాఖలాలు కానీ లేవు. ఇక జనసేన పార్టీలో చెప్పుకోదగిన నాయకులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ లేరు. తెలంగాణాలో జనసేన ఉనికే కనిపించని పరిస్థితి ఉంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ఈ తరుణంలో పోటీకి సిద్ధమని జనసేన ప్రకటించినా ఆ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లే పరిస్థితులు కనిపించటంలేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం అభాసుపాలు కావడానికే అన్న చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+