వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల ఎఫెక్ట్: రూటుమార్చిన పవన్ కళ్యాణ్ 'ఫ్యాన్', వేదిక మారింది!

ఆర్కే బీచ్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో జనసేన అభిమానులు... ప్రత్యేక హోదా నిరసన పైన ప్లాన్‌ను మార్చినట్లుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆర్కే బీచ్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో జనసేన అభిమానులు... ప్రత్యేక హోదా నిరసన పైన ప్లాన్‌ను మార్చినట్లుగా తెలుస్తోంది. నిరసన ప్రదర్శన ఆర్కే బీచ్ వద్ద కాదని, వుడా పార్క్ వద్ద అని చెబుతూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ ఓ యువతి ట్వీట్ చేశారు.

'హెచ్చరిక.. జగన్ సహా ఎవరైనా..': త్యాగానికి సిద్ధం కానీ: మురళీ మోహన్'హెచ్చరిక.. జగన్ సహా ఎవరైనా..': త్యాగానికి సిద్ధం కానీ: మురళీ మోహన్

తమిళ యువత జల్లికట్టు కోసం చేసిన ఆందోళనకు కేంద్రం దిగొచ్చింది. ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. మెరీనా బీచ్‌లో లక్షలాది మంది యువత చేపట్టిన పోరాటానికి ఫలితం దక్కింది. తమిళుల స్పూర్తితో ఏపీ యువత కూడా ప్రత్యేక హోదాపై నిరసన గళం వినిపించేందుకు సిద్ధమైంది.

jana sena

ఇవాళ విశాఖలోని ఆర్కే బీచ్‌లో మౌన దీక్ష ద్వారా కేంద్రానికి తమ వాదనను వినిపించేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటోంది. అయితే సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఈ ఆందోళనకు అనుమతి లేదని, ఈ నిరసనకు నాయకత్వం వహిస్తుందెవరో ముందుకొచ్చి పోలీసు శాఖను సంప్రదించాలని ఏపీ డీజీపీ సాంబశివ రావు, విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ ఇప్పటికే ప్రకటించారు.

ముందుగా ప్రకటించినట్టుగానే ఎక్కడికక్కడ యువతను పోలీసులు నిలువరిస్తున్నారు. అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ పోరాటానికి పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. విశాఖలో భారీగా పోలీసులను మొహరించారు.

బీచ్‌లోకి ప్రతీరోజూ వాకింగ్‌కు వచ్చే వాకర్లను కూడా పోలీసులు అనుమతించలేదు. స్థానికులమని ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే తప్ప బీచ్‌లోకి అనుమతించడం లేదు. దీంతో ఇక్కడ తలపెట్టిన నిరసన కార్యక్రమం జరుగుతుందో, లేదో అన్న ఉత్కంఠ నెలకొంది.

బాబుకు రాజమౌళి షాక్: మహేష్ బాబు ద్రోహి..'రియల్' హీరో పవన్ వెంట నడువు: వర్మబాబుకు రాజమౌళి షాక్: మహేష్ బాబు ద్రోహి..'రియల్' హీరో పవన్ వెంట నడువు: వర్మ

అయితే పోలీసులు వ్యవహార శైలితో యువతి రూట్ మార్చడం గమనార్హం. ఆర్కే బీచ్‌లో పోలీసులుండటంతో వేదికను వుడా పార్క్‌కు మార్చినట్లు హోదాకు మద్దతుగా నిలిచిన పలు ఫేస్‌బుక్ పేజీల్లో, ట్విట్టర్ ఖాతాల్లో పోస్టింగ్స్ జోరందుకున్నాయి. యువత అక్కడికి రావాలని పిలుపునిస్తున్నారు. హీరో సంపూర్ణేష్ బాబు ఇదే విషయమై పవన్ ఫ్యాన్ పేరుతో ఉన్న ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు.

English summary
Jana Sena chief Pawan Kalyan fan said that venue changed to VUDA park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X