హైకోర్టును ఆశ్రయించిన పవన్, వ్యక్తిగత హక్కులను కాపాడండి..!!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ, హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పోస్టుల కారణంగా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వ్యక్తిత్వ హక్కులు కాపాడాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తమ ఫోటోలను, వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (AI) సాయంతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే పవన్ పిటిషన్‌ని శుక్రవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం అవుతున్న లింకులను 48 గంటల్లోగా తమకు అందించా లని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. అంతేకాకుండా, ఆ లింకులపై వారం రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను వీడియోలను ఉపయోగించి AI ద్వారా సృష్టించిన తప్పుడు కంటెంట్‌ను తొలగించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్ 22కు వాయిదా వేసింది. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ను వ్యక్తి గతం గా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆయన్ను దెబ్బతీసేందుకు కొందరు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటు న్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిని సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించడం తో ఇప్పుడు కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం చిరంజీవి, నాగార్జున, తారక్ సహా పలువురు ప్రముఖులు ఇదే తరహాలో కోర్టును ఆశ్రయించారు. తమ పేరు, ఫొటోలు, వాయిస్ ను దుర్వినియోగం చేస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేసారు. దీంతో, ఇప్పుడు పవన్ పిటీషన్ విషయంలోనూ న్యాయస్థానం తగిన చర్యలకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications