స్టే ట్యూన్డ్ ‘బట్టలు విప్పి మాట్లాడుకుందాం’, అజ్ఞాతవాసి ఎవరో తెలుసా?: పవన్ చురకలు

Recommended Video

    సోదరీమణులతో వ్యాపారం చేస్తున్నవారిని బైకాట్ చేయండి.

    హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం, విమర్శలు చేసిన పవన్.. తాజాగా మరోసారి అదేస్థాయిలో విమర్శలు గుప్పించారు.

     జనసైనికులూ శాంతం..

    జనసైనికులూ శాంతం..

    జనసేన సైనికులు శాంతంగా ఉండాలని, ఎలాంటి హింసకు పాల్పడకుండా ఉండాలని పవన్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. శ్రీనిరాజు తనపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నారని, అయినా మీరు మిమ్మల్ని నియంత్రించుకోవాలని కోరారు. తాను కూడా ఆ బలమైన మీడియా ఛానళ్లతో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

    అసభ్య ఛానళ్లను బైకాట్ చేయండి..

    అసభ్య ఛానళ్లను బైకాట్ చేయండి..

    మన తల్లుల్ని, కూతుళ్లను, చెల్లెళ్లను అసభ్యంగా దూషించిన టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానళ్లను బైకాట్ చేయాలని పవన్ పిలుపునిచ్చారు. నగ్నత్వం, అశ్లీలతలతో వ్యాపారం చేస్తున్న ఆ ఛానళ్లను దూరం పెట్టాలని కోరారు. నిస్సహాయులైన సోదరీమణులతో వ్యాపారం చేస్తున్న వీటిని బైకాట్ చేయాలన్నారు.

     అజ్ఞాతవాసి ఎవరు తెలుసా?

    అజ్ఞాతవాసి ఎవరు తెలుసా?

    నిజమైన ‘అజ్ఞాతవాసి' మీకు ఎవరో తెలుసా? అని పవన్ ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు. ఆ తర్వాత ‘నాకు ఇష్టమైన స్లోగన్ " ఫ్యాక్షనిస్టుల ఆస్తలుని జాతీయం చెయ్యాలి" అసలు యీ స్లోగన్ వెనకాల కథ కి యీ స్లోగన్ కి సంబంధం ఏంటి?' అని పవన్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

     బ్లాక్‌మెయిల్ అని ముఖ్యమంత్రే..

    బ్లాక్‌మెయిల్ అని ముఖ్యమంత్రే..

    ‘నిజాల్ని నిగ్గు తేలుద్దాం ప్రోగ్రాం నుంచి మీ పవన్ కళ్యాణ్' అంటూ మరో ట్వీట్ చేశారు. ‘ఒక రాష్ట్ర కాబినెట్ రాంక్ మంత్రి స్వయానా యీ " అజ్ఞ్యాతవాసి" ని " వాడో బ్లాక్‌మెయిలర్ అని స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని అని "ఒకరి"తో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, "ఒకరు" ఎవరు... తెలుసుకోవాలనివుందా!' అని పవన్ ప్రశ్నించారు.

    బట్టలు విప్పి మాట్లాడుకుందాం..

    బట్టలు విప్పి మాట్లాడుకుందాం..

    ‘స్టే ట్యూన్డ్ టూ ‘బట్టలు విప్పి మాట్లాడుకుందాం' ప్రొగ్రాం నుంచి పవన్ కళ్యాణ్ కెమెరామెన్ ట్విట్టర్‌తో' అని పవన్ వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పవన్ శుక్రవారంగా ఘాటైన ట్వీట్లతో విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. మళ్లీ శనివారం కూడా అలాంటి ట్వీట్లనే పోస్టు చేశారు పవన్.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+