రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కే అంతుంటే..: వపన్ ఆగ్రహం, ‘అందుకే జనసేన వచ్చింది’

Recommended Video

    జగన్ కు గట్టి సమాధానం చెప్పిన పవన్

    అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన తీవ్ర విమర్శలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను బలమైన వ్యక్తిని కనుకనే తనపై జగన్ విమర్శలు చేస్తున్నారని పవన్ అన్నారు.

    రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కే అంతుంటే..

    రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కే అంతుంటే..

    పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ మీడియాతో మాట్లాడుతూ.. మార్పు కోసం ప్రయత్నిస్తున్నాననే కోపంతోనే జగన్, బీజేపీ, టీడీపీ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కే అంతుంటే.. నిజాయితీపరుడినైన తనకు ఎంత ఉండాలని పవన్ ప్రశ్నించారు. భారత రాజ్యాంగం రాసింది చంద్రబాబో.. జగనో.. కాదని విమర్శించారు.

     ఓపిక అవసరం

    ఓపిక అవసరం

    రాజకీయాలకు శ్రమ, ఓపిక చాలా అవసరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సామాజిక మార్పు తీసుకురావడం తన ఆశయమని, దాని కోసమే సినిమాలను సాధానంగా ఉపయోగించుకున్నానని తెలిపారు. భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్‌లో ‘నవయుగ జనసేన' పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్న జనసైనికులతో బుధవారం పవన్ సమావేశమయ్యారు.

    అందుకే జనసేన..

    అందుకే జనసేన..

    ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయా ప్రయోజనాల కోసం కొంతమంది నాయకులు జనం మధ్య తగాదాలు పెట్టి విభజించి పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారిని ధైర్యంగా ఎదుర్కోవడానికే జనసేన పార్టీని ప్రారంభించామని తెలిపారు.

    ఇవన్నీ చేసింది జన సైనికుడే..

    ఇవన్నీ చేసింది జన సైనికుడే..

    జ‌న‌సేన మూడో ప్ర‌త్యామ్నాయంగా, మూడో ఆలోచ‌న విధానం రావ‌డం వ‌ల్లే ఉద్దానం, ఉండ‌వ‌ల్లి వంటి స‌మ‌స్య‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయని పవన్ గుర్తు చేశారు. ఉద్దానం కిడ్నీ సమ‌స్య‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చింది ఎవ‌రో పెద్ద రాజ‌కీయ‌నాయ‌కుడు కాద‌ని, మీలాగే ఒక జ‌న‌ సైనికుడ‌ని చెప్పారు. ప్ర‌తిమండ‌లానికి 15 నుంచి 20 మంది యువ‌త‌తో ఓ క‌మిటీ వేస్తామ‌ని, ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి గ్రామ‌గ్రామానికి తిరిగి ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వ్యధలు స్వయంగా తెలుసుకోవాల‌ని సూచించారు.

    గూండాయిజానికి భయపడొద్దు

    మీరు(జనసేన శ్రేణులు) తెచ్చిన స‌మాచారంతోనే భావిత‌రాల భ‌విష్య‌త్తు బాగుండ‌డం కోసం ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్టాలో నిర్ణ‌యిద్దామ‌ని పవన్ తెలిపారు. రాజ‌కీయాల‌కు వేల‌ కోట్లు అవ‌స‌రం లేద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చిత్తశుద్ధితో పోరాడితే ప్రజలు మ‌న వెన‌క ఉంటార‌ని జ‌న‌సైనికుల‌కు దిశానిర్దేశం చేశారు. వేల‌ కోట్లు డ‌బ్బులు ఉంటే అహ‌కారం, త‌ల‌పొగ‌రు పెరుగుతాయ‌ని అన్నారు. స‌హ‌నానికి కూడా హ‌ద్దు ఉంటుంద‌ని, బెదిరించి, గూండాయిజానికి దిగితే భ‌య‌ప‌డొద్ద‌ని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+