ఇన్‌స్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ పోస్ట్; భావోద్వేగభరితం!!
ఎప్పుడెప్పుడా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్‌స్టాగ్రామ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన పోస్టు కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టకుండానే ఇన్‌స్టాగ్రామ్ లో 2.4 మిలియన్ల ఫాలోవర్ లను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ లో అడుగు పెట్టడంతోనే ప్రభంజనం సృష్టించారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ఎటువంటి పోస్టులు పెడతారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన పెట్టే మొదటి పోస్టు ఏమై ఉంటుంది అని కూడా చాలామంది క్యూరియాసిటీ చూపించారు.

ఈ క్రమంలో నేడు జూలై 15వ తేదీన సాయంత్రం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లో తన మొదటి పోస్టును పెట్టారు. ఈ పోస్ట్ పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ఆయన ప్రయాణాన్ని సూచిస్తుంది. గొప్ప వారితో కలిసి పవన్ కళ్యాణ్ సినిమాలలో సాగిస్తున్న ప్రయాణం ఈ పోస్టు ద్వారా అర్థమవుతుంది. చాలా భావోద్వేగభరితంగా ఆ పోస్ట్ ఉంది.
ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియో ని షేర్ చేసిన పవన్ కళ్యాణ్ మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి. మరెన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తున్నాను అంటూ ప్రముఖ నటులతో కలిసి ఉన్న ఫోటోలను కలిపి ఒక వీడియోగా చేసి షేర్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఆ వీడియోలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి , నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, బాలకృష్ణ హీరోలతో పాటు విశ్వనాథ్, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి దర్శకులు ఉన్నారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి అంటూ చిత్ర పరిశ్రమలోని వారికి తన కృతజ్ఞతలను తెలియజేశారు.
సినీ పరిశ్రమ పట్ల తనకున్న ప్రేమను, అభిమానాన్ని తన మొదటి పోస్ట్ ద్వారా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీ వంటి మంచి మనసున్న హీరోకు అభిమానిగా ఉన్నందుకు గర్వపడుతున్నామని అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు మీకు ఇష్టమైన హీరోని అభిమానించండి కానీ రాష్ట్ర బాగు కోసం ఈసారి జనసేన వైపు చూడండి అంటూ మరికొంత మంది పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications