హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరినీ ఏకేశారు: పవన్ కళ్యాణ్ హావభావాలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓటుకు నోటుపై స్పందించకపోయినప్పటికీ.. సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంశాల పైన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్ర నేరమని కెసిఆర్‌కు, సెక్షన్ 8 అవసరం లేదని చంద్రబాబుకు షాకిచ్చారు.

అంతేకాదు, ఇరు రాష్ట్రాల విషయమై పర్యవేక్షణకు ఓ కమిటీ వేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారు. ఆ కమిటీలో యూపీఏ, ఎన్డీయే నేతలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. యాదాద్రికి ఉత్తరాంధ్రకు చెందిన సాయిని ఆర్కిటెక్టర్‌ను నియమించి కెసిఆర్ సమభావన చాటారని కొనియాడారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఓటుకు నోటు పైన పవన్ కళ్యాణ్ స్పందించేందుకు నిరాకరించారు. ఆ పని కోర్టులు పోలీసులు చూసుకుంటాయన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రా ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ప్రత్యేక హోదా పైన ప్రసంగంలో.. చంద్రబాబు, వెంకయ్య నాయుడు, మురళీ మోహన్‌లను వదిలేసి మిగతావారి పేర్లు చెప్పారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఆంధ్రా పాంతం నుంచి ఎన్నికైన ఎంపీలంతా పార్లమెంటులో ఏం చేస్తున్నారని, గోడలను, స్థంబాలను చూస్తూ మైమరిచి పోతున్నారా? అంటూ నిలదీశారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలంగాణ ఎంపీలను చూసి నేర్చుకోవాలని, వారు స్వరాష్ట్రం కోసం ఎలా పోరాడారో ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రంతో కొట్లాడాలని సూచించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

నిత్యం ఆంధ్రొళ్లు అనొద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సూచించారు. ఆంధ్రా బాబు ఆనొద్దని సూచించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

కోపమొస్తే తిట్టేటపుడు ఆంధ్రా సీఎం అనో ఆంధ్ర చంద్రబాబు అనో కాకుండా డైరెక్టుగా చంద్రబాబు అని తిట్టండని సూచించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతం భారతదేశంలో మరో కొత్త రాష్ట్రంగా ఏర్పాటైందే కానీ, ప్రత్యేక దేశంగా ఆవిర్భవించలేదని కేసీఆర్ గ్రహించాలన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

టీడీపీని ఆంధ్ర పార్టీగా అనుక్షణం చెబుతున్న కేసీఆర్, ఆంధ్రలో ఎన్నో పార్టీలున్నాయని, అందులో టీడీపీ కూడా ఒకటన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలంగాణ అన్నది దేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాల్లో ఒకటి మాత్రమే అని, ప్రత్యేక దేశం కాదన్న విషయం కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా ఆయన మాట్లాడరాదని సూచించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

అలాగే, ప్రతి అంశంలోనూ తనకంటూ అభిప్రాయాలు ఉంటాయన్నారు. కానీ, అందరి రాజకీయ నేతల్లా నేను నోరుపారేసుకోలేనన్నారు.

 పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఇరు ప్రభుత్వాధినేతలు బాధ్యతగా మాట్లాడవలసిన అవసరం ఉందన్నారు. లేనిపక్షంలో ఇరు రాష్ట్రాల్లో సివిల్ వార్‌కు దారితీసి అంశాంతి నెలకొంటుందన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

మన రాజకీయ నేతల తీరుచూస్తుంటే 'కొడుకు తల్లి దగ్గరకెళ్లి ఏం చేసి బతకాలని అడిగితే, నోరుచేసుకుని బతకురా' అందట, అలా ఉంది మన నేతల తీరు' అని మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను కలిశానని గుర్తు చేశారు. ఆ సమయంలో మోడీ తనతో చెప్పిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు జాతి ఐక్యత దేశ సమగ్రతలో భాగమని మోడీ అన్నారని చెప్పారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

దానిని నిజం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నిర్మాణానికి విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్ సాయిని ఆర్కిటెక్ట్‌గా పెట్టుకోవడంతో తెలుగు జాతి ఐక్యతకు తొలి అడుగు వేశారా అనిపించిందన్నారు. ఇందుకు కేసీఆర్‌కు అభినందనలు చెప్పారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓటుకు నోటుపై స్పందించకపోయినప్పటికీ.. సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంశాల పైన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్ర నేరమని కెసిఆర్‌కు, సెక్షన్ 8 అవసరం లేదని చంద్రబాబుకు షాకిచ్చారు.

English summary
Jana Sena chief Pawan Kalyan gesture in press meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X