వీడియో: పవన్ ప్రాయశ్చిత్తం అక్కడే

Pawan Kalyan: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది.

కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది.

Pawan Kalyan has arrived Lord Venkateswara Swamy Temple to take Prayaschitta Deeksha

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు.

దీని తరువాత సంభవించిన పరిణామాల నేపథ్యంలో- జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించాల్సి వచ్చింది. సాక్షాత్ శ్రీమహావిష్ణువు స్వరూపమైన శ్రీవేంకటేశ్వరస్వామివారికి నైవేద్యంగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూలను పెట్టారని ఆయన ఆరోపించారు.

ఈ చర్యతో తిరుమల లడ్డూ అపవిత్రం కావడం వల్ల ప్రాయశ్చిత్తంగా తాను ఈ దీక్షను చేపట్టనున్నట్లు ఆయన శనివారమే వెల్లడించారు. నేటి నుంచి 11 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. గత వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీయడాన్ని నిరసిస్తూ ఆయన ఈ దీక్షను మొదలు పెట్టనున్నారు.

ఈ దీక్షను స్వీకరించడానికి కొద్దిసేపటి కిందటే ఆయన గుంటూరు జిల్లా నంబూరులో గల శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రానికి చేరుకున్నారు. గతంలో తొమ్మిది రోజుల పాటు దీక్ష చేసినప్పుడు ధరించిన కాషాయ వస్త్రాల ధారణ, నుదుటన నామంతో ఇప్పుడూ కనిపించారు.

ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం లభించింది. పవన్ వస్తోన్నారనే సమాచారం ముందుగానే తెలియడం వల్ల జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలు చల్లుతూ సాదరంగా ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+