పవన్ కల్యాణ్ పేరు చెప్పి ఏకంగా దందాలు, డీఎఫ్ వోకు పగిలింది
తన పేరు చెప్పుకుని ఎవరినైనా బెదిరించినా, తన పేరు దుర్వినియోగం చేసినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అటవీ శాఖలో ఉన్న అధికారుల పేర్లు, తన పేరు చెప్పుకొని మైనింగ్ వ్యాపారులను, కింది స్థాయి అధికారులను బెదిరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
ఇదే సమయంలో కాకినాడ డీఎఫ్ వో రవీంద్రనాథ్ రెడ్డి పై విచారణ జరిపి ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ డీఎఫ్ వో రవీంద్రనాథ్ రెడ్డి పై విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాల జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో హాట్ టాపిక్ అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇటీవలే రవీంద్రనాథ్ రెడ్డి కాకినాడ డీఎఫ్ వోగా బాధ్యతలు స్వీకరించారు.

కాకినాడీ అటవి శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మైనింగ్ వాహనాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న రవీంద్రనాథ్ రెడ్డి కొందరు మైనింగ్ వ్యాపారులకు ఫోన్లు చేసి బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ అటవీ శాఖలో తాను చెప్పిందే వేదమని, తన మాటకు ఎదురు చెబితే పరిస్థితులు వేరుగా ఉంటాయని డీఎఫ్ వో రవీంద్రనాథ్ రెడ్డి కొందరు మైనింగ్ వ్యాపారులను, అటవి శాఖలోని కొందరు అధికారులకు ఫోన్లు చేసి బెదిరించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరకు వెళ్లింది.
డీసీఎం పవన్ కల్యాణ్ పేరు అడ్డం పెట్టుకుని, అటవీ శాఖలోని సీనియర్ అధికారుల పెర్లు చెబుతున్న డీఎఫ్ వో రవీంద్రనాథ్ రెడ్డి పలువురిని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డీఎఫ్ వో రవీంద్రనాథ్ రెడ్డి విషయంలో సీరియస్ అయ్యారని, ఆయనపై విచారణకు ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. తన పేరు చెప్పుకొని అటవీశాఖ లో ఎవరినైనా బెదిరించినా, తన పేరు దుర్వినియోగం చేసినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications