జూ ఎన్టీఆర్‌ను కార్నర్ చేసిన పవన్, ఫ్యాన్స్ అసహనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో అధికారంలోకి రానున్న తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడం ద్వారా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను కార్నర్ చేయగా, గెలుపొందిన చంద్రబాబు నాయుడును అభినందించేందుకు రెండు రోజులు ఆలస్యంగా రావడంపై నందమూరి బాలకృష్ణ వర్గంతో పాటు టిడిపి వర్గీయులు అసహనంతో ఉన్నారట.
జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు నందమూరి కళ్యాణ్ రాంతో కలిసి ఆదివారం చంద్రబాబును కలుసుకున్నారు. ఎన్నికల ఫలితాలు శుక్రవారం విడుదలయితే జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం... అంటే రెండు రోజుల తర్వాత రావడం టిడిపి క్యాడర్‌కు, నందమూరి అభిమానులకు సంతృప్తిని ఇవ్వలేదట.

పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి కూటమి తరఫున సీమాంధ్రలో జోరుగా ప్రచారం చేసిన విషయం తెలిసందే. ఇప్పుడు టిడిపి అధికారంలోకి వస్తోంది. టిడిపికి ప్రచారం చేసిన పవన్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఒత్తిడిలోకి నెట్టినట్లయిందని అంటున్నారు.
చంద్రబాబును కలిసేందుకు జూనియర్ ఎన్టీఆర్ తర్జన భర్జన పడ్డారట. అందుకు పవన్ ప్రచారం కూడా ఓ కారణమనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే సన్నిహితులు, కుటుంబ సభ్యుల సూచన మేరకు ఆయన బాబును కలుసుకున్నారు. కానీ ఆలస్యంగా కలవడాన్ని నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారట.












Click it and Unblock the Notifications