పవన్ కళ్యాణ్ మాటలు మెగా ఫ్యామిలీకే నచ్చలేదా.. ?
ఎన్నో ఆశలు, మరెన్నో అవమానాల మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బంపర్ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే శ్రీవారి లడ్డూ వివాదం తెర మీదకు వచ్చింది.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో అవినీతి చోటు చేసుకుందని.. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల ఎముకలతో చేసిన ఆయిల్ ను ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జరుగుతున్నదేంటి అంటే చంద్రబాబు ఆరోపణలు చేసి వారం గడుస్తున్నా..ఈ ఆరోపణలు నిరూపించే విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నేరం మోపపడిన వైసీపీ మాత్రం సీబీఐ విచారణ డిమాండ్ చేయడంతో పాటు, ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తికి లేఖలు రాసి దీనిపై సమగ్ర విచారణ చేయాలని పట్టుపడుతోంది. ఇక మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరో అడుగు ముందుకేసి ఏకంగా స్వామివారి ముందే తమ పాలనలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రమాణం చేయడం జరిగింది.

ఇదే సమయంలో అధికార పార్టీ మాత్రం కేవలం ఆరోపణలతో కాలాన్ని వృధా చేస్తోంది. దీనిపై కేవలం సిట్ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఆరోపణల మీద దర్యాప్తు సాగించి దీనిని ఒక కొలిక్కి తీసుకుని రావాల్సిన నేపథ్యంలో ఇంకా అవే డిబేట్లు కొనసాగుతుండడంతో భక్తులు అంతా తల్లడిల్లిపోతున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దీని మీద పాలనాపరంగా అడుగులు ముందుకు వేయించాల్సిన సమయంలో ప్రాయశ్చిత్త దీక్షతో సరిపెడుతున్నారనే వాదన తెర మీదకు వస్తోంది. ప్రాయశ్చిత్త దీక్ష పదకొండు రోజుల పాటు అని అన్నారు. దాంతో పాటు ఆయన ఊరుకోకుండా దేవాలయాల వద్దకు వెళ్ళి అక్కడ శుభ్ర పరచే కార్యక్రమాన్ని చేస్తున్నారు. పవన్ ప్రతిపక్షంలో లేరు. కీలకమైన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. నిప్పు లాంటి నిజం నిగ్గును తేల్చాల్సిన పదవిలో ఉన్నారు. నిజాన్ని బయటపెట్టకుండా సనాతన ధర్మం అంటూ ఆయన మాట్లాడడం పట్ల కూడా చర్చ సాగుతోంది.
సనాతన ధర్మం అంటే ఆయనకు ఏమి తెలుసు అని పరోక్షంగా సీపీఎం నాయకుడు బీవీ రాఘవులు పవన్‌పై సెటైర్లు వేయడం జరిగింది. అయితే ఈ విషయంపై సినీ ఇండస్ట్రీని సైతం పవన్ లాగడం జరిగింది. ఈ విషయంపై మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి. లేదంటే సైలెంట్‌గా ఉండండంటూ హుకుం జారీ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తోన్న తీరుపై ఆయన కుటుంబ సభ్యులు కూడా అంత సంతోషంగా ఉంటారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ విషయంలో ఈ వివాదంపై మెగా హీరోలు ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్‌కు నిలవలేదు. ఇదే సమయంలో ఈ విషయంలో జగన్‌ది ఎటువంటి తప్పు లేదని ఆయనకు పవన్ కల్యాణ్ క్లీన్ చీట్ ఇవ్వడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించే పదవిలో ఉండి కూడా ఇలా దీక్షలు, యాగాలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగా తప్పు జరిగి ఉంటే ఆ తప్పును అందరి ముందు బయటపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని స్వామి వారి భక్తులు కోరుతున్నారు. ఇలాంటి సమయంలో కావాల్సింది దీక్షలు, యాగాలు కాదని శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా అన్న నిజమే భక్తులకు తెలియజేయాలి. ఇప్పటికైనా పవన్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో అధికారికంగా చేయాల్సింది చేయాలనే అంతా కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications