ప్రతిష్టాత్మక అవార్డ్ కోసం యూకేకు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత జనసేనపై దృష్టి
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో బ్రిటన్ వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆయన షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Recommended Video

హైదరాబాద్/అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో బ్రిటన్ వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆయన షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ కోసం యూరప్‌లో ఉన్నారు.

ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ
ప్రస్తుతం సినిమా యూనిట్ యూరప్‌లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. అలాగే పాటలను కూడా చిత్రీకరిస్తోంది. త్వరలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్నందున, సినిమాలను త్వరగా పూర్తి చేసే బిజీలో ఉన్నారు.

యూకేకు పవన్ కళ్యాణ్
అయినప్పటికీ పవన్ కళ్యాణ్ యూకేలోని హౌస్ ఆప్ లార్డ్స్ వెళ్లేందుకు కొంత విరామం తీసుకోనున్నారు. అక్కడ ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం అవార్డును ఆయన అందుకోనున్నారు.

ఉద్ధానంపై స్పందనకు గాను
ఈ అవార్డును వివిధ రంగాల్లోని ప్రముఖులకు ప్రతి ఏడాది ఒకరికి ఇస్తుంటారు. శ్రీకాకుళంలోని ఉద్ధానం సమస్యపై స్పందనకు గాను పవన్ కళ్యాణ్‌కు దీనిని ఇస్తున్నారు. ఉద్దానం సమస్యను పవన్ లేవనెత్తడం వల్ల ప్రభుత్వం కదిలింది. వైద్య నిపుణులు కూడా ముందుకు వచ్చారు.

వచ్చాక జనసేనపై దృష్టి
నవంబర్ 15వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ యూరోప్‌లో సినిమా చిత్రీకరణలో ఉంటారని, ఆ తర్వాత యూకేకు వెళ్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత భారత్ వచ్చాక అతను జనసేన పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు.












Click it and Unblock the Notifications