వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే చంద్రబాబుకు మద్దతిచ్చా.. కానీ: సుజనాకు పవన్ షాక్

చంద్రబాబునాయుడుకు పరిపాలన అనుభవం ఉందని, ఆయన బంగారు ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారనే ఆయనకు మద్దతు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పరిపాలన అనుభవం ఉందని, ఆయన బంగారు ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారనే ఆయనకు మద్దతు ఇచ్చినట్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాటం చేయకపోవడం ఆయన పొరపాటేనని అన్నారు.

ప్రజలంటే ఆటలా? చేతులు ముడుచుకుని కూర్చోం: పవన్ హెచ్చరిక (వీడియో)

హోదా వస్తోందని చెప్పారు, పెద్ద నోట్లను రద్దు చేయాలని తానే కేంద్రానికి సూచించానని చెప్పిన చంద్రబాబు.. ఇబ్బంది ఎదురవుతోందని తర్వాత అన్నారని, ఇంత అనుభవం ఆయన ఇలా మాట మారిస్తే ఎలా అని ప్రశ్నించారు. హోదాపై చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో తెలియడం లేదని అన్నారు.

సింగపూర్‌లా రాజధానిని చేస్తామని చెబుతున్నారని, సింగపూర్ జాతిపితను ఆదర్శంగా తీసుకున్నామని చెబుతున్నా చంద్రబాబు.. ప్రజలు, రైతుల ఇబ్బందులను కూడా పట్టించుకోవాలన్నారు. రాయపాటి సాంబశివరావుతో తనకు ఎలాంటి విభేదాలు, శత్రుత్వం లేదని పవన్ చెప్పారు.

Pawan Kalyan hits out Sujana chowdary

సుజనాపై ఫైర్

ప్రత్యేక హోదా అంశంపై వెనుకడుగు వేస్తున్న ఈ ప్రభుత్వంతో విభేదించడానికి ఎంతో సమయం పట్టదని అన్నారు. మీ పక్షం ఎందుకుండాలో? రోడ్లపైకి ఎందుకు రాకూడదని టిడిపి ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. జల్లి కట్టు స్ఫూర్తితో కోళ్ల పందేలు, పందుల పందేలు ఆడుకోమంటున్నారని సుజనా చౌదరిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేగాక, ఏ స్ఫూర్తితో బ్యాంకులు మీకు ఇచ్చిన రుణాలను ఎగ్గొట్టారంటూ సుజనా చౌదరిని పవన్ కళ్యాణ్ నిలదీశారు. తాను ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందని అన్నారు. నిజానిజాలు తెలుసుకోవాల్సినంత యంత్రాంగం తన వద్ద లేదని అన్నారు. హోదా కోసం జరుగుతున్న ఆందోళనను, నిరసనను కించపర్చవద్దని అన్నారు.

పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు.. బంగారు ఏపీని చేస్తారని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. రాయపాటి సాంబశివరావు కంపెనీలకు పోలవరం కాంట్రాక్ట అప్పగించారని, అక్కడ ప్రజలు, రైతులకు కలిగి ఇప్పందులను ఎందుకు పట్టించుకోవడం లేదని చంద్రబాబును పవన్ ప్రశ్నించారు. పచ్చటి పొలాల్లో మట్టిపోస్తున్నారని అన్నారు. దీనిపై నిపుణుల కమిటీని జూడీషియర్ వ్యక్తులతో ఏర్పాటు చేయాలన్నారు.

శాంతియుత ఆందోళన చేస్తున్న యువతకు కనీసం గంట సమయమైన ఇవ్వాల్సిందని అన్నారు. ఆందోళన వాయిదా వేశామే గానీ, విరమించుకోలేదని చెప్పారు. చంద్రబాబు, వెంకయ్యలను తాను గౌరవిస్తానని.. కానీ వారు మీడియా ముందుకు వచ్చిన తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. అనంతపురం సభలో అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని అన్నారు.

English summary
Janasena Party chief Pawan Kalyan hits out at union minister Sujana chowdary for special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X