శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో పవన్ నిరాహారదీక్ష?: ఉద్దానం సమస్యలపై పోరు..

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలవాలి, హెల్త్ ఎమర్జెన్సీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి ఇచ్చిన 48గం. డెడ్ లైన్ పూర్తవడంతో.. శుక్రవారం సాయంత్రం నుంచే నిరాహార దీక్షకు పూనుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

బాబు ఏదీ చెప్పలేదు, డిమాండ్లివే: పవన్ దీక్ష ప్రారంభం, షాకిచ్చిన పోలీసులు అందుకే ఇలా బాబు ఏదీ చెప్పలేదు, డిమాండ్లివే: పవన్ దీక్ష ప్రారంభం, షాకిచ్చిన పోలీసులు అందుకే ఇలా

శుక్రవారం రిసార్టులోనే నిరాహారదీక్ష కొనసాగించిన పవన్.. శనివారం మాత్రం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో దీక్ష చేయనున్నారు.ఈ నేపథ్యంలో నేటి ఉదయం 8.30గం.కి ఎచ్చర్ల రిసార్టు నుంచి శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీకి బయలుదేరారు పవన్.

pawan kalyan hunger strike at srikakulam arts college

ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించిన 17డిమాండ్లపై ఆయన దీక్ష చేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ జనసేన కార్యకర్తలు దీక్షలు చేయనున్నారు.

పవన్ డిమాండ్స్:

  • ఉద్దానంలోని అన్ని గ్రామాల్లో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కిడ్నీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలి.
  • ప్రతి డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బందిని నియమించాలి. వారానికి
  • ఒకసారి డయాలసిస్ కేంద్రానికి నెఫ్రాలజిస్టు వెళ్లి చికిత్స అందించాలి.
  • డయాలసిస్ కేంద్రాలను పెంచాలి. ఈ కేంద్రాలకు అనుబంధంగా బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి.
  • కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మందులను ఉచితంగా అందించాలి.
  • డయాలసిస్ చేయించుకునేవారికి... అన్ని స్టేజుల్లో ఉన్నవారందరికీ పింఛన్లు అందించాలి.
  • కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి.
  • శుద్ధి చేసిన నీటిని ప్రతి గడపకూ అందించాలి.
  • వ్యాధి ప్రబలడానికి మూలాలను అన్వేషించేందుకు పరిశోధన కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి.
  • ముఖ్యమంత్రి స్వయంగా ఉద్దానం కిడ్నీ సమస్య, నివారణ చర్యలను పర్యవేక్షించాలి. దీని కోసం స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలి.
  • ఉద్దానంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి.
  • రాష్ట్రానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని వెంటనే నియమించాలి.
English summary
Janasena President Pawan Kalyan continuing his hunger strike on saturday. This morning he is coming to Srikakulam arts college to stage protest
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X