పిచ్చి కూతలు, ఊరుకోం: కెసిఆర్‌కు పవన్ హెచ్చరిక
హైదరాబాద్: పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోబోమని జనసేన అధినేత, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావును హెచ్చరించారు. దేశమంతా నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కోరుకుంటోందని ఆయన అన్నారు. హైదరాబాదులో మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన వేదికను పంచుకుని ప్రసంగించారు. దేశమంతా కాంగ్రెసు హఠావో, దేశ్ బచావో నినాదం ఇస్తోందని ఆయన అన్నారు.
దేశప్రజలు సంతోషంగా ఉండాలంటే మోడీ ప్రధాని కావాలని, ఎన్డియె అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. దేశసమగ్రతను కాపాడే నాయకుడు దేశానికి కావాలని, ఆ సమర్థత నరేంద్ర మోడీకి ఉందని ఆయన అన్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధానం సరి కాదని ఆయన అన్నారు. కెసిఆర్ మాట్లాడే విధానం సరిగా లేదని ఆయన అన్నారు. సీమాంధ్రలు తెలంగాణలో పోటీ చేయకూడదని కెసిఆర్ అంటున్నారని, పివి రాయలసీమ నుంచి పోటీ చేశారని, ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారి, ఇది భారతదేశమని, ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని, ఇది భారతదేశమని, రెచ్చగొట్టే విధానం మంచిది కాదని ఆయన అన్నారు.

పిచ్చిపిచ్చిగా, పద్ధతి లేకుండా సోనియా, రాహుల్ నాయకత్వంలో రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని, స్వీట్లు పంచుకుని విడిపోయే విధంగా చేయాల్సింది విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేశారని ఆయన అన్నారు. కొంత మంది నాయకులు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ దేశంలో అంతర్భాగమని ఆయన అన్నారు. తెలుగుజాతి దెబ్బ తింటే దేశ సమగ్రత దెబ్బ తింటుదని ఆయన అన్ారు.
సీమాంధ్రులను తిట్టడం సరి కాదని ఆయన అన్నారు. కుటుంబ వారసత్వ రాజకీయాలు మంచివి కావని ఆయన అన్నారు. క్రికెట్‌లో జాతీయ జట్టులో ఆడాలంటే జోనల్, రంజీ క్రికెట్లు ఆడాలని, అవేమీ లేకుండా ఏకంగా ప్రధాని కావాలని రాహుల్ గాంధీ ఆశిస్తున్నారని ఆయన అన్నారు. అవన్నీ ఏమీ అవసరం లేదు, ఇందిర ఇంట్లో పుట్టాను కాబట్టి ప్రధాని కావచ్చునని అనుకుంటున్నారని ఆయన అన్నారు. మోడీది సమర్థమైన నాయకత్వమని, మోడీ ప్రధాని కావాలని దేశప్రజలంతా కోరుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications