పవన్ వ్యూహం అదేనా: దుమ్మెత్తిపోసిన సాక్షి, అజ్ఞాతవాసికి ముడిపెట్టి..

Posted By:
Subscribe to Oneindia Telugu
  Jagan Media Blames Pawan Kalyan

  హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటానికి తెర తీసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై సాక్షి మీడియా ఆసక్తికరమైన వార్తాకథనాన్ని ప్రచురించింది. కాలయాపనా... కాపాడే వ్యూహమా అనే శీర్షిక పెట్టిన ఆ వార్తాకథనాన్ని ప్రచురిచింది.

  సాక్షి మీడియా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిదనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర నిధుల అంశంపై శ్వేత పత్రం విడుదల చేయాలని పవన్ కల్యాణ్ రెండు ప్రభుత్వాలను అడగడమంేట కాలయాపన చేయడానికే, మిత్ర పక్షాలను కాపాడడానికే అని సాక్షి మీడియా ప్రశ్నించింది.

  పవన్ కల్యాణ్ ఏమన్నారు

  పవన్ కల్యాణ్ ఏమన్నారు

  కేంద్రం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వంం ఎంతు పుచ్చుకుంది తనకు లెక్కలు చెప్పాలని పవన్ కల్యాణ్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ తర్వాత మీడియాతో అన్నారు. వాటిలో వాస్తవాలేమిటో నిజ నిర్ధారణ కమిటీతో అధ్యయన చేయిస్తానని ఆయన చెప్పారు.

  పవన్ కల్యాణ్ మాటలపై సాక్షి ఇలా...

  పవన్ కల్యాణ్ మాటలపై సాక్షి ఇలా...

  పవన్ కల్యాణ్ మాటలపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నరని, తాము ఇంత ఇచ్చామని కేంద్రం, కాదు ఇంతే పుచ్చుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఇంకా లెక్కలు ఇవ్వాలని, నిజనిర్దారణ కమిటీతో పరిశీలింపజేస్తానని పవన్ కల్యాణ్ అనడమంటే కాలయాపన చేయడానికి తప్ప మరోటి కానే కాదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయని సాక్షి, వ్యాఖ్యానించింది.

  పవన్ చంద్రబాబును నిలదీయలేకపోతున్నారని..

  పవన్ చంద్రబాబును నిలదీయలేకపోతున్నారని..

  విభజన తర్వాత రాష్ట్రం నిలదొక్కుకోవాలన్నా, శాశ్వత అభివృృద్ధికి అడుగులు పడాలన్నా, యువతకు భవిత ఉండాలన్నా ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నా ప్రత్యేక ప్యాకేజీ పేరిట కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబును ఇప్పటి వరకు నిలదీయలేకపోయారని పవన్ కల్యాణ్‌ను పలువురు ప్రశ్నిస్తున్నారని సాక్షి డైలీ రాసింది.

  వారి మధ్య అవగాహన ఏమిటో..

  వారి మధ్య అవగాహన ఏమిటో..

  ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు అన్నప్పుడే పవన్ ప్రశ్నించకపోవడంలోని ఔచిత్యం ఏమిటని సాక్షి ప్రశ్నించింది. వారి మధ్య ఉన్న అవగాహన ఏపాటిదో తెలిసిపోయిందని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకర వ్యాఖ్యానించినట్లు సాక్షి రాసింది.

  పోలవరంపై ఇలా...

  పోలవరంపై ఇలా...

  పోలవరం ప్రాజెక్టులో అవినీతి తీవ్రతను మీడియాతో సహా అని వ్యవస్థలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర ప్రభుత్వం, తమ పార్టీకి చెందిన నాయకులు ఎత్తి చూపినప్పుడు పవన్ కల్యాణ్‌కేమీ గుర్తుకు రాకపోవడం చిత్రంగా ఉందని బిజెపి నాయకుడొకరు ఎద్దేవా చేసినట్లు రాసింది. ఇప్పుడు లెక్కలు అడగడం కన్నా పట్టిసీమలో అవినీతిని కాగ్ కడిగి పారేసినప్పుడే జనసేన అధ్యక్షుడు కనీసం ఒక్క మాటైనా ప్రశ్నించి ఉంటే బాగుండేదనే వ్యాఖ్యాలు వినిపిస్తన్నాయి.

  రాజధాని అమరావతిపై..

  రాజధాని అమరావతిపై..

  రాజధాని ఏర్పాటు మొదలు అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు రైతులకు చేసిన, చేస్తున్న అన్యాయాల గురించి ఇలా వచ్చి అలా మాట్లాడి వెళ్లిపోయి, ఆ తర్వాత పట్టించుకోకపోవడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో అంతుబట్టడం లేదని సాక్షి వ్యాఖ్యానించింది.

  ఉండవల్లి ఇప్పటికే చెప్పారు.

  ఉండవల్లి ఇప్పటికే చెప్పారు.

  జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై చాలా సీరియస్ అవినీతి ఆరోపణలు చేశారని సాక్షి తన కథనంలో గుర్తు చేస్తూ పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమపట్నంలలో జరిగిన అవినీతిని ఎక్కడైనా నిరూపిస్తానని ఉంవల్లి బహిరంగంగా సవాల్ విసిరారని రాసింది. ముందుగా వాటిలోని వాస్తవాలేమిటో పవన్ ఉండవల్లని అడిగి తెలుసుకుంటే మంచిదని, అప్పుడు ఆయన మాట్లాడేదాన్ని బట్టి జనసేన నేత వాస్తవికత ఏమిటో తేలిపోతుందని మాజీ ఎంపి ఒకరు వ్యాఖ్యానించినట్లు రాసింది.

  చంద్రబాబు చిక్కుల్లో పడిన ప్రతిసారీ...

  చంద్రబాబు చిక్కుల్లో పడిన ప్రతిసారీ...

  చంద్రబాబు ఇరకాటంలో పడిన ప్రతిసారీ పవన్ ప్రత్యక్షమవుతాని, అప్పటి వరకు అజ్ఞాతంలో ఎక్కుడ ఉంటారో కూడా తెలియదని మరో సీనియర్ నేత ఎద్దేవా చేసినట్లు సాక్షి రాసింది. మొన్నటికి మొన్న పవన్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు చంద్రబాబు సర్కారు గతంలో ఎవ్వరూ ఇవ్వని విదంగా ప్రత్యేక అనుమతులు ఇవ్వడాన్ని ఆయన గుర్తు చేసినట్లు రాసింది.

  చంద్రబాబుకు గట్టిగానే తగిలింది...

  చంద్రబాబుకు గట్టిగానే తగిలింది...

  "తాజా ప్రజాగ్రహం చంద్రబాబు సర్కారుకు గట్టిగా తగిలింది. ప్రత్యేక హోదా వద్దని, అదేమీ సంజీవని కాదని చంద్రబాబు అనడం ఎంత తప్పిదమో రాష్ట్ర ప్రజలు ఇప్పుడు గుర్తించారు. ప్రత్యేక ప్యాకేజీ రాక, కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన మేర కేటాయింపులు జరగకపోవడంతో ఏమీ పాలుపోని పరిస్థితి. పోలవరం, రాజధానిలో జరిగిన అవినీతితో పాటు ఇతరత్రా లొసుగులన్నీ బట్టబయలు అవుతాయనే ఆందోళన చంద్రబాబులో తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితిలో రంగప్రవేశం చేసిన పవన్ వ్యూహం.. ప్రభుత్వంపై ఏర్పడుతున్న ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించడమే కావొచ్చుని, గడిచిన పరిణామాలను కూడా గమనిస్తే ఇదే అభిప్రాయం బలపడుతోంద"ని మరికొందరు వ్యాఖ్యనిస్తన్నట్లు సాక్షి మీడియా ముక్కాయింపు ఇచ్చింది.

  ఎందుకీ వార్తాకథనం

  ఎందుకీ వార్తాకథనం

  తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ప్రజలు అంటున్నారని, అభిప్రాయపడుతున్నారని సాక్షి వార్తా కథనం యావత్తూ సాగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ చురుగ్గా ముందుకు వస్తే వైయస్ జగన్‌పై దెబ్బ పడుతుందనే ఉద్దేశంతో చంద్రబాబుతో కుమ్మక్కయ్యారనే పద్ధతిలో ఆ వార్తాకథనం రాసినట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా తిప్పికొట్టడమే ఈ వార్తాకథనం ఉద్దేశంగా భావించవచ్చు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress presidet YS Jagan's Sakshi media has published an article blaming Jana Sena chief Pawan Kalyan.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి