రేపు ఆ మెగా కార్యక్రమం-తప్పకుండా రావాలని యువత, మహిళలకు పవన్ ఆహ్వానం..!
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత తన సొంత శాఖ అయిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై పూర్తి స్దాయిలో ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం సాధన దిశగా అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు భారీ ఎత్తున గ్రామాల్లో సభలు నిర్వహించాలన నిర్ణయించారు. రాష్ట్రంలోని 13326 గ్రామ పంచాయతీల్లో రేపు నిర్వహించే ఈ గ్రామ సభలకు తప్పకుండా హాజరుకావాలని యువత, మహిళలకు పవన్ కళ్యాణ్ ఇవాళ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఎన్నికల సమయంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని కూటమి హామీ ఇచ్చిందని, దీనికి అనుగుణంగా ఇప్పుడు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటికే పంచాయతీల్లో సంస్కరణలు ప్రారంభించామని, స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహణకు నిధుల పెంపు ఇందులో భాగమేనని పవన్ వెల్లడించారు. గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా పక్కాగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మరోవైపు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో చోటు చేసుుకున్న రియాక్టర్ పేలుడు ఘటనపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉందన్నారు. పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ తన పరిధిలో ఉన్నప్పటికీ భద్రత మాత్రం వేరే శాఖ కిందకు వస్తుందన్నారు. అయినా పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహణపై గతంలోనే ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతీ వారం ఏదో ఒక ప్రమాదం అలవాటుగా మారిందన్నారు. దీనిపై వచ్చే నెలలో విశాఖ వెళ్లి సమీక్ష నిర్వహిస్తామని పవన్ వెల్లడించారు. అచ్యుతాపురం ఘటనపై కేవలం సంతాపం తెలిపి, ఎక్స్ గ్రేషియా ఇచ్చినంత మాత్రాన సరిపోదన్నారు.












Click it and Unblock the Notifications